Video Viral: పాముని మరో పాము చంపి తినడం చూశారా? చూడని వారు భయపడకుండా ఈ వీడియో చూడండి..

Venomous Viper Snake Video Viral: ఎప్పుడైనా పాము మరో పామును చంపుకుని తినే దృశ్యాలు చూశారా? ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఓ రాటిల్ స్నేక్ ఇతర పామును చంపుకుని తినడానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 15, 2025, 01:47 PM IST
Video Viral: పాముని మరో పాము చంపి తినడం చూశారా? చూడని వారు భయపడకుండా ఈ వీడియో చూడండి..

Venomous Viper Snake Video Viral: పాముల్లో అతి విషపూరితమైన భయంకరమైన పాములు కూడా ఉంటాయి..ఇవి ఇతర చిన్న పాములను ఆహారంగా చేసుకుని వేటాడు. ఇలాంటి ప్రవర్తన కేవలం కొన్ని జాతులకు సంబంధించిన పాముల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని జాతులకు సంబంధించిన పాములైతే ఏకంగా అతి క్రూరమైన జంతువులను సైతం వేటాడి ఆహారంగా మలుచుకుంటాయి. తరచుగా ఇలా వేటాడుతున్న పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కనిపించే చాలావరకు దృశ్యాలు అతి భయంకరమైన పాములు క్రూరమైన జంతువులను వేటాడడం ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. పాములు పాములే దాడి చేసుకొని చంపుకుంటాయా అనే ప్రశ్నను రేకెత్తిస్తున్నారు.

Add Zee News as a Preferred Source

అతి విషపూరితమైన పాములు రాటిల్ స్నేక్ ఒకటి. ఈ పాము ఎంత ప్రమాదకరమైందంటే ఒక్కసారి జంతువు లేదా మనుషుల పైన అయినా దాడి చేస్తే చంపకుండా వదిలిపెట్టదు. ఇలాంటి పాములు చాలా అరుపుగా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఎడారి కి సంబంధించిన రాటిల్ స్నేక్స్ అయితే అతి భయంకరమైన విషపూరితమైన పాములుగా పేరుపొందాయి. ఇవి ఎడారిలో జీవిస్తూ.. వాటికి ఆహారంగా ఇతర పాములను చంపుకొని తింటూ ఉంటాయి. అంతేకాకుండా క్రిమి కీటకాలను సైతం వదిలిపెట్టకుండా వాటిని కూడా ఆహారంగా చేసుకుంటాయట. ఈ పాములు దాడి చేసే క్రమంలో బుసలు కొడుతూ మరి కాటేసేందుకు ప్రయత్నిస్తాయని సమాచారం. 

తాజాగా వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. వీడియోలో మీరు ఒక అతిపెద్ద రాటిల్ స్నేక్ దాని నోట్లో ఒక పాము ఉండడం మీరు గమనించవచ్చు. అలాగే ఆ పాము తన నోట్లో ఉన్న పాములు చంపేందుకు బుసలు కొడుతూ వీడియోలో రికార్డ్ అయింది. పెద్ద పాము నోట్లో ఉన్న మరో పాము కొన ఊపిరితో తోకను అటు ఇటు అనడం కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు. చివరగా పెద్ద పాము చిన్న పామును చంపేందుకు ఒక్కసారిగా ఆ పామును భూమికి కొడుతుంది. దీంతో ఆ పాము మరణిస్తుంది. ఇలాంటి సన్నివేశాలు కెమెరాల్లో చాలా అరుదుగా రికార్డు అవుతూ ఉంటాయి. అయితే ఈ వీడియోలో ఉన్న పాము అతి పెద్ద రాటిల్ స్నేక్.. దీని ముందు ఏదైనా ఎరగా మారాల్సిందే. ఈ వీడియోను  @AMAZlNGNATURE అనే X ఖాతా నుంచి ఓ సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కూడా కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News