Venomous Red King Cobra Video: ప్రపంచంలోనే అరుదైన రెడ్‌ కింగ్‌ కోబ్రా.. చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్స్..

Venomous Red King Cobra Video: అందరూ సాధారణంగా కింగ్‌ కోబ్రాలు చూసి ఉంటారు. ఎప్పుడైనా ఎరుపు రంగు కింగ్‌ కోబ్రాలు చూశారా? దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 16, 2025, 08:47 AM IST
Venomous Red King Cobra Video: ప్రపంచంలోనే అరుదైన రెడ్‌ కింగ్‌ కోబ్రా.. చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్స్..

Venomous Red King Cobra Video Watch Here: అందరూ సాధారణ కింగ్‌ కోబ్రాలు చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా రెడ్‌ కింగ్‌ కోబ్రాలు చూశారా? ఇవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ కింగ్‌ కోబ్రాల శాస్త్రీయ నామం ఒఫియోఫాగస్ హన్నా.. దీనిని తెలుగులో కూడా ప్రత్యేకమైన ఆర్థం ఉంటుంది. దీనిని పాములను తినే జాతిగా అని అంటారు. దీని పేరు గ్రీకు భాషలో ఆహారాన్ని సూచిస్తూ ఉంటుంది.  ఆంగ్లంలో రెడ్‌ కింగ్‌కోబ్రాగా పిలిస్తే.. తెలుగులో ఎరుపు రంగు రాజ నాగుపాముగా పిలుస్తారు. ఈ పాము అన్ని స్నేక్స్‌ కంటే చాలా ప్రత్యేకం.. అంతేకాకుండా ఇది కొన్ని చోట్ల మాత్రమే జీవించే పాముగా చెప్పుకుంటూ ఉంటారు.

Add Zee News as a Preferred Source

ఈ రెడ్‌ కింగ్ కోబ్రాలు అన్ని పాములకంటే అరుదైన శరీరాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా కింగ్ కోబ్రాలు నలుపు, గోధుమ, ఆలివ్ లేదా పసుపు రంగులలో కనిపిస్తాయి. కానీ ఈ ఎర్రటి కింగ్ కోబ్రాలు అందులో చాలా ప్రత్యేకం.. ఇవి వాటి శరీరంపై ప్రకాశవంతమైన ఎరుపు లేదా నారింజ రంగు చర్మం కలిగి ఉంటుంది. ఈ అరుదైన పాములు ప్రత్యేకంగా తోక భాగాలలో లేత రంగు చారలను కూడా కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఇవి దాదాపు  5 మీటర్ల కంటే ఎక్కువ పొడవును కలిగి ఉంటాయని సమాచారం. అలాగే వీటికి కూడా ప్రత్యేకమైన పడగ ఉంటుంది. 

ఎక్కువగా ఎర్రటి కింగ్ కోబ్రాలు భారతదేశంతో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ఎక్కువగా జీవిస్తాయి. అలాగే చిత్తడి నేలలో ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఇవి ఎత్తైన ప్రాంతాల్లో నివసించడానికి ఇష్టపడతాయని సమాచారం. ఈ పాములు ఆహారం కోసం ఇతర పాములను చంపుకుని తింటాయి. దీంతో పాటు ఎక్కువగా ఎలకలు, పక్షులను కూడా తింటాయని సమాచారం. ఈ రెండ్‌ కింగ్‌ కోబ్రాలు ఒంటరిగా ఉండేందుకు ఆసక్తి చూపుతాయి. అలాగే జనావాసాల్లోకి ఎక్కువగా సంచారం చేస్తూ ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు ఈ పాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్‌ అవుతూ ఉంటాయి. 

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో రెడ్‌ కలర్‌ కింగ్‌ కోబ్రాను చూడొచ్చు. అంతేకాకుండా ఓ ఇంట్లో ప్రవేశిస్తున్న ఈ పామును స్నేక్‌ క్యాచర్‌ పట్టుకుని ఇతరులకు చూపించడం మీరు గమనించవచ్చు. అలాగే ఆ రెడ్ కింగ్‌ కోబ్రా కూడా కెమెరా వైపు చూడడం మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్‌ కామెంట్స్‌లో స్పందిస్తున్నారు. ఈ వీడియోను @sujaysnakesaver అనే య్యూటుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు 31 వేల సోషల్‌ మీడియా వినియోగదారులు కామెంట్‌ చేశారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News