Villagers Attack on Lady Aghori video: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహం ధ్వంసం తర్వాత లేడీ అఘోరీ తెరమీదకు వచ్చింది. అప్పటి నుంచి తెలంగాణతోపాటు, ఏపీలో కూడా సంచరిస్తు అఘోరీ కాకరేపుతుంది. ముఖ్యంగా హిందువుల దేవాలయాల్లో ఎక్కడ దాడులు, విగ్రహాల ధ్వంసం జరిగిన కూడా అఘోరీ తనదైన స్టైల్ లో మండిపడేది.
వేముల వాడ రాజన్న ఆలయంలో దర్గా ఎందుకని.. దాన్ని కూల్చేస్తానని కూడా అఘోరీ తెగ రచ్చ చేసింది. ఈ నేపథ్యంలో లేడీ అఘోరీ ఇటీవల ఏపీకి చెందిన బీటెక్ యువతి వర్షిణిని లోబర్చుకుందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ యువతి మాత్రం తన ఇష్టప్రకారమే అఘోరీ వెంట వెళ్లానని.. తాను కూడా అఘోరీలా మారతానని కూడా చెప్పుకొచ్చింది.
వర్షిణి కుటుంబ సభ్యులు అఘోరీ తమకు సెక్సువల్ గా వేధించిందని.. అసలు ఆమె చెప్తున్న వాటికి, చేసిన పనులకు పొంతన లేదని.. అఘోరీ ముసుగులో ప్రజల్నిమోసం చేస్తుందని కూడా ఆరోపణలు చేశారు. తమ కూతుర్ని లేడీ అఘోరీ బారి నుంచి కాపాడి తమకు అప్పగించాలని వర్షిని కుటుంబ సభ్యులు గుంటూరు పోలీసుల్ని ఆశ్రయించారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం అఘోరీ వ్యవహరం ప్రస్తుతం తెలుగు స్టేట్స్ లలో చాలా వరకు కాంట్రవర్సీగా మారిందని చెప్పుకొవచ్చు.
మొదట్లో చాలా మంది అఘోరీ హిందు దేవాలయాలు, మహిళల కోసం మాట్లాడుతుందని సాఫ్ట్ కార్నర్ చూపించారు. కానీ అఘోరీ మాత్రం వివాదాలు రాజేస్తు.. ఆమె చేసిన పనులు చూసి జనాలు ఛీ కొడుతున్నారు. తాజాగా.. ఒక వీడియోలో కొంత మంది అఘోరీపై తల్వార్ పట్టుకుని మరీ దాడులకు దిగారు.
అక్కడున్న మహిళలు ఆపిన కూడా అఘోరీ గొంతు పిసికి కారులోనే తగలపెడతామంటూ కొందరు అఘోరీకి చుక్కలు చూపించారు. కానీ ఇంతలో అక్కడున్న కొందరు సముదాయించి.. అఘోరీని అక్కడి నుంచి వెళ్లేలా చేశారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. అయితే.. ఈ ఘటన గతంలో జరిగినట్లు తెలుస్తొంది. కానీ నెటిజన్లు మళ్లీ దీన్ని ట్రోల్స్ చేస్తున్నారు. అఘోరీకి సరైనబుద్ది చెప్పాలని కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ లు చేస్తున్నారు.









