Villagers Brutally Attacks and torture bear video: కొంత మంది సమాజంలో నీచులు మనుషులపైనే కాదు..నోరులేనీ జీవాల పట్ల కూడా క్రూరంగా ప్రవర్తిస్తారు. కొందరు రోడ్డుపైన వెళ్తున్న జంతువుల కోసం, మూగ జీవాల కోసం ఏదైన తినేందుకు, తాగేందుకు పెడుతుంటారు. తమకు తోచిన సాయం చేస్తారు . ముఖ్యంగా అడవికి దగ్గరగా ఉండే గ్రామాల్లోని ప్రజలు కొంతమంది జంతువులు ఎప్పుడైన తమ గ్రామాల్లోకి వస్తే వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇస్తారు.
ఇటీవల కాలంలో అడవుల్లోని చిరుతలు, ఏనుగులు , ఎలుగు బంట్లు తాగు నీటి కోసం, ఆహారపు వేటల్లో సమీపంలోని గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత మందిపై జంతువులు దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిలో ముఖ్యంగా ఒక ఎలుగు బంటి అడవుల నుంచి దారితప్పి గ్రామాల్లోకివచ్చింది.
A startling 6-month-old video from Chhattisgarh, #India depicts a #Bears stuck in wire and a human torcher growing more and more in agony. Only now has the #forest Department taken notice. What a shameful lapse in wildlife protection! #SaveWildlife #Chhattisgarh pic.twitter.com/90eDjnuRLY
— Nitin Singhvi, India (@RaipurNitin) April 12, 2025
ఛత్తీస్ గఢ్ లోని సుక్మాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అడవుల నుంచి దారితప్పి బైటకు వచ్చిన ఒక ఎలుగు బంటిపై కొంతమంది గ్రామస్థులు దాడులు చేశారు. దాన్ని అక్కడున్న పెద్ద కర్రకు కట్టేసి.. దాని మీద కూర్చుని నోరు విరిచేశారు. అంతేకాకుండా అది బాధతో విలవిల్లాడుతుంటే.. దాని కాళ్ల గోర్లుసైతం విరగొట్టారు.
మొత్తంగా అది కొన్ని గంటల పాటు విలవిల్లాడుతుంటే.. అక్కడున్న వారు చోద్యం చూస్తు, వీడియోలు తీస్తు ఉండిపోయారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆ ఎలుగు బంటిని కాపాడే ప్రయత్నం మాత్రం చేయలేదు. చివరకు ఈ నీచుల టార్చర్ భరించలేక ఆ ఎలుగు బంటి అక్కడే ప్రాణాలు విడిచింది. మొత్తంగా ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Read more: Cobra Vs Peacock Video: వామ్మో.. 100 అడుగుల లోతైన బావిలో పాము, నెమలి ఫైటింగ్.. షాకింగ్ వీడియో..
దీనిపై ఫారెస్ట్ సిబ్బందిసైతం రంగంలోకి దిగారు. నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. దీనిపై ఫారెస్ట్ చట్టం కింద కేసును నమోదు చేశామని తెలిపారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









