AI Video: ఎప్పుడూ సీరియస్‌గా ఉండే డొనాల్డ్‌ ట్రంప్‌ .. ఏపీ రైతులా మారితే ఎలా ఉంటాడు? వీడియో చూడండి.. 

Donald Trump AI Video: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కు సంబంధించిన సెలబ్రిటీల వీడియోలు నేడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇండియాకి అది కూడా ఆంధ్రప్రదేశ్‌కు వస్తే రైతుల ఎలా ఉంటాడో చూడండి..

Written by - Renuka Godugu | Last Updated : Apr 20, 2025, 08:15 AM IST
AI Video: ఎప్పుడూ సీరియస్‌గా ఉండే డొనాల్డ్‌ ట్రంప్‌ .. ఏపీ రైతులా మారితే ఎలా ఉంటాడు? వీడియో చూడండి.. 

 Donald Trump AI Video: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ  అంటే అంతా కాదు. చూసే వారిని ఆసక్తికరంగా అబ్బుర పరుస్తున్నాయి. అసలు వాళ్ల క్రియేటివిటీకి రూపొందించిన వీడియోలను చూస్తే దానికి ఇంకా వాయిస్ కూడా జత చేయడంతో అసలు నిజమైన వీడియోల మారుతున్నాయి. సెలబ్రిటీలు రాజకీయవేత్తలు, సామాజిక మాధ్యమాల్లో వాళ్లకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఏఐ వీడియో కూడా నెట్టింటా వైరల్ అవుతుంది.

Add Zee News as a Preferred Source

ఒకవేళ భారత్‌కు వస్తే అది కూడా ఆంధ్రప్రదేశ్ రైతులా మారితే ఎలా ఉంటాడో చూపించారు. పచ్చని పొలాల మధ్య సైకిల్ తొక్కుతూ ..పిల్లలతో సంక్రాంతి దీపావళి వేడుకలు జరుపుకుంటారు. అదే కాదు ఏపీ సీఎం చంద్రబాబుతో బీచ్ వద్ద మాట్లాడుతున్న వీడియోలుగా మారుతున్నాయి. వీడియోలో ట్రంప్ సైకిల్ పై గడ్డిమోపు తీసుకువెళుతున్న వీడియో అయితే అచ్చం రైతులా మారినా అమెరికా అధ్యక్షుడు వీడియో అబ్బురపరుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్‌చల్ చేస్తుంది. అంతేకాదు పచ్చని పొలాల వద్ద కొబ్బరి బోండం తాగుతూ తోటి రైతులతో ముచ్చట్లు పెడుతూ చంద్రబాబుతో మాట్లాడుతున్న వీడియో విందు భోజనం చేస్తున్న వీడియో లో ఉంది. 

 అయితే ఈ వీడియోకి బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ బలగం సినిమాలోని 'తెల్లా తెల్లాని పాలధారలే పల్లె తెల్లవారుతుండదిరా' అని చేర్చారు. దీంతో ఇది అచ్చంగా రైతులకు సంబంధించిన పాట కాబట్టి నెట్టింటా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో రూపొందించిన వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. 

 

 

ఇదిలా ఉంటే మరికొంతమంది ఈ ఏఐ వీడియోలు అద్భుతాలు చేస్తాయి. కానీ సైబర్ నేరాలకు సెలబ్రిటీల వీడియోలను తప్పుడు పద్ధతిలో చూపిస్తున్నారు. దీంతో నేరగాళ్ల వాళ్లలో సాధనను ప్రజలు చిక్కుకునే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వాటిని ప్రోత్సహించకపోవడం మంచిదని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

...Read More

Trending News