Viral Business Idea: ప్రపంచంలోనే ది బెస్ట్ బిజినెస్.. ప్రతి నెల 10 మిలియన్ల సంపాదించవచ్చు.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది!

Viral Business Idea In Telugu: చాలామంది అనేక రకాల వ్యాపారాలు చేసి ఉంటారు.. కానీ ఎప్పుడైనా మీరు తేళ్లతో కూడిన వ్యాపారం చూశారా..?  తేళ్లలో ఉండే విషంతో కూడా చాలామంది వ్యాపారం చేస్తారు. ఇప్పుడు ఇది పెద్ద బిజినెస్ గా మారింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 26, 2025, 03:19 PM IST
Viral Business Idea: ప్రపంచంలోనే ది బెస్ట్ బిజినెస్.. ప్రతి నెల 10 మిలియన్ల సంపాదించవచ్చు.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది!

Viral Business Idea In Telugu: చాలా ప్రాంతాల్లో కొందరు వ్యవసాయదారులు ఆవులతో పాటు మేకలు గొర్రెలు పందుల పెంపకాలు చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లోనైతే రొయ్యల పెంపకాలు కూడా చేస్తారు. ఇలా ప్రాంతాన్ని బట్టి వివిధ రకాల జంతువులను పెంచుతూ ఉంటారు. ఇక మరికొన్ని దేశాల్లో నైతే ప్రమాదకరమైన పాములతో పాటు తేళ్లను కూడా పెంచుతూ ఉంటారు. వీటి నుంచి విషాన్ని తీసి కోట్లలో విక్రయిస్తారు. ముఖ్యంగా కొంతమంది అయితే  తేళ్లను భారీ మొత్తంలో పెంచి.. వాటి నుంచి విషాన్ని సేకరించి కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. 

Add Zee News as a Preferred Source

ఎవ్వరు ఊహించని కొన్ని వింతలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వింత ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆశ్చర్యకరంగా మారింది.. ఓ వ్యాపారి తేళ్ల వ్యాపారానికి సంబంధించిన వీడియో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చాలామందికి వీటిని చూస్తే  మనసులో అనేక ప్రశ్నలు రేకెత్తవచ్చు. తేళ్లను ఏం చేసుకుంటారు? వాటి వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? వాటి విషయంతో ఎందుకు ఇంత వ్యాపారం చేస్తున్నారని? అందరికీ ఇలాంటి ప్రశ్నలు మదిలో మెదలవచ్చు. నిజానికి తేళ్ల నుంచి తీసిన విషయంతో అనేక రకాల సౌందర్య సాధనాలను తయారు చేసుకోవచ్చట. ఇవి శరీరానికి సౌందర్యాన్ని ఇచ్చేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయని తేళ్ల వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి తేలు దాదాపు రోజులు రెండు మిల్లీగ్రాముల విషయాన్ని ఉత్పత్తి చేస్తుందని.. ఒక లీటర్ తేలు విషం ధర $10 డాలర్లు ఉందని వారంటున్నారు.

అంతేకాకుండా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన మందులను తయారు చేసేందుకు కూడా తేలు విషయాన్ని వినియోగిస్తారని కొంతమంది వ్యాపారులు తెలుపుతున్నారు. మార్కెట్లో కొన్ని తేళ్లకు సంబంధించిన లీటర్ విషం రూ. 85 కోట్లకు పైగా అమ్ముడుపోతోందని  వారంటున్నారు. ప్రస్తుతం తేళ్ల పెంపకానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కొంతమంది ఇంట్లోనే చిన్న చిన్న గదులుగా చేసుకొని తేళ్లను పెంచుతున్నారని వ్యాపారులు తెలుపుతున్నారు. ఇక తేళ్ల వ్యాపారం చేసేవారు వాటికి ప్రత్యేకమైన సదుపాయాలను ఏర్పాటు చేసి.. ఈ వ్యాపారం చేస్తున్నట్లు వారు తెలుపుతున్నారు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను మాస్సిమో అనే X ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒకే గదిలో కొన్ని లక్షల తేళ్లకు సంబంధించిన దృశ్యాలను మీరు చూడవచ్చు. ఈ వీడియోని ఇప్పటివరకు దాదాపు 90,000 మందికిపైగా వీక్షించారు. అంతేకాకుండా ఇది నా కలల వ్యాపారం అంటూ క్యాప్షన్ పెట్టి వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోను చూసిన కొంతమంది వారి అభిప్రాయాలను కూడా కామెంట్లలో వ్యక్తం చేస్తున్నారు. చూడడానికి నమ్మశక్యంగా లేదు.. ఇవి గ్రాఫిక్స్ అంటూ కొంతమంది కామెంట్లలో చెబుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి వ్యాపారం చేసే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు పాటిస్తూ.. చేయడం ఎంతో మంచిది.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News