Viral News: ఇక్కడి అమ్మవారు చాలా ఫేమస్.. నూడిల్స్ నైవేద్యం పెట్టి.. కోరికలు కోరుకుంటే పక్కా నెరవేరుతాయి!

Chinese Food Prasad Viral News: కోల్‌కతాలోని ఓ ప్రాంతంలో అమ్మవారు చాలా ఫేమస్ ఇక్కడి ప్రాంతంలో అమ్మవారికి నైవేద్యంగా ప్రత్యేకమైన నూడిల్స్ తో పాటు మోమోలను సమర్పిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడి సాంప్రదాయం అన్ని దేవాలయాల కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 12, 2025, 01:08 PM IST
Viral News: ఇక్కడి అమ్మవారు చాలా ఫేమస్.. నూడిల్స్ నైవేద్యం పెట్టి..  కోరికలు కోరుకుంటే పక్కా నెరవేరుతాయి!

Chinese Food Prasad Viral News: ప్రపంచవ్యాప్తంగా హిందూ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని పురాతనమైన దేవాలయాలు ప్రత్యేకమైన సాంప్రదాయాలతో అద్భుతమైన కట్టడాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా కొన్ని వందల ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయ పద్ధతిలోనే ఇప్పటికీ చాలామంది ఆయా చోట్లలో ఉండే దేవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా కొన్ని దేవాలయాల్లో ఉన్న ప్రత్యేకమైన సాంప్రదాయం ప్రకారం, చొక్కా విప్పేసి దర్శనం చేసుకుంటే మరికొన్ని చోట్ల దేవాలయాల్లో తడి బట్టలతో దర్శనం చేసుకోవడం ఒక ప్రత్యేకమైన పద్ధతిగా వస్తోంది. అయితే తాజాగా కలకత్తాలోని ఓ దేవాలయంలోని వింత సాంప్రదాయానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కోల్‌కతాలోని ఓ ఆలయంలో వింత సాంప్రదాయం ఇప్పుడు ప్రతి చోట వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఇక్కడి ఆలయంలో ఉండే అమ్మవారికి సమర్పించే ఆహారం చాలా విభిన్నంగా ఉంటుంది.

Add Zee News as a Preferred Source

కోల్‌కతాలోని టెంగ్రా ప్రాంతంలోని కాళి ఆలయంలో అమ్మవారికి సమర్పించే ఆహారం చాలా ప్రత్యేకం.. ఇక్కడ భక్తులందరూ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ఫ్రైడ్ రైస్‌తో పాటు మోమోలు నూడిల్స్‌ను ప్రసాదంగా సమర్పించడం ఒక సాంప్రదాయంగా వస్తుందట.. అంతేకాకుండా ఈ ఆలయాన్ని చాలామంది చైనీస్ ఖాళీ ఆలయంగా కూడా పిలుస్తారట.. 60 సంవత్సరాల పురాతనమైన ఆలయంలో ఇప్పటికీ అమ్మవారు భక్తుల పూజలు అందుకుంటుంది. ఇక్కడ ఎక్కువగా హిందువులు మాత్రమే కాకుండా చైనీలు కూడా అమ్మవారిని పూజించడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. చాలామంది చైనాలు ఇక్కడికి వచ్చి అమ్మవారికి ప్రత్యేకమైన నూడిల్స్ నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు.

ఈ చైనీస్ అమ్మవారికి సంబంధించిన అనేక కథలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.. ఇక్కడికి 10 సంవత్సరాల క్రితం చైనా సంబంధించిన కుటుంబం.. అనారోగ్య సమస్యతో అమ్మవారిని దర్శించుకొని, ప్రాణ బిక్ష పెట్టమని ప్రార్థించారట.. ఈ ఆలయ సమీపంలో ఉన్న ఓ చెట్టు కింద అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డను పడుకోబెట్టి.. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారట వారికి కాళికాదేవి ప్రత్యక్షమై ఆ బిడ్డను తనే బ్రతికిస్తుందని చెప్పిందంట.. అయితే అప్పటి నుంచి ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో చైనీలు అక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన పెద్ద ఆలయాన్ని నిర్మించారు. అంతేకాకుండా వారికి ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలు నూడిల్స్, మోమోలు ఆహారంగా సమర్పిస్తూ ఉండేవారట. దీంతో అప్పటి నుంచి అక్కడ ఇలాంటి ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తోంది.

10 సంవత్సరాల నుంచి ఈ చైనీస్ కాళీ ఆలయానికి దాదాపు అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఎక్కువ సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారట. అంతేకాకుండా ఇక్కడ దర్శించుకుని వెళ్లిన చాలా మందికి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభించిందని చెబుతూ ఉంటారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తరచుగా ఈ ఆలయాన్ని సందర్శించి.. ప్రత్యేకమైన నూడిల్స్ను నైవేద్యంగా సమర్పిస్తారట. దీంతో అప్పటి నుంచి ఇప్పటివరకు కాళికాదేవికి ఫ్రైడ్ రైస్‌తో పాటు నూడిల్స్‌ను నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. కొంతమంది అయితే ఇక్కడి ప్రజలు అమ్మవారికి కొవ్వొత్తులతో దీపాన్ని కూడా వెలిగిస్తారట. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారిని పూజించడం ఒక ఆనవాయితీగా వస్తోందని అక్కడి స్థానికులు చెబుతున్నారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News