Viral Snake Video: హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువు శేషతల్పంపై పవళిస్తారన్న సంగతి తెలిసిందే. ఆ శేషానికి ఎన్నో తలలు ఉంటాయి. అలాంటి పామును పోలిన రెండు తలల పాములను మనం ఎక్కడో ఒక్కసారైనా చూసే ఉంటాం. పాములను మనం నాగదేవతలాగా పూజిస్తాం. అలాంటిది రెండు లేదా అంతకంటే ఎక్కువ తలలతో కనిపించిన పాములను విపరీతంగా పూజిస్తామనే సంగతి తెలిసిందే.
ఇదే అదునుగా చూసే కొందరు కేటుగాళ్లు రెండు తలల పాములతో వ్యాపారం చేస్తున్నారు. అక్రమంగా తరలించడంతో పాటు కొన్ని రకాల పాములను ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ ద్వారా ఒకటి కంటే ఎక్కువ తలలను మార్ఫింగ్ చేస్తూ.. అలాంటి పాములను అమ్ముతామని నమ్మబలుకుతున్నారు. ఇప్పుడు అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ నాగుపాముకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 తలలు ఉన్నాయి.
ఇటీవలే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ గ్రామీణ ప్రాంతంలో భారీ శేషనాగు కనిపించింది. దానికి ఐదు తలలు ఉండడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే నాగదేవత ప్రత్యక్షమైందని చాలా మంది భక్తులు ఆశ్చర్యంగా చూస్తుంటే.. మరికొందరు నెటిజన్లు మాత్రం ఇది క్రియేటెడ్ వీడియో అని, ఏఐ ద్వారా ఒక తల పాముని ఎడిట్ చేసి 5 తలల మాదిరిగా మార్చారని కామెంట్లు చేస్తున్నారు.
వీడియో ప్రకారం.. ఐదు తలల శేషనాగు పొలంలో కొన్ని గుడ్లను కాపాడుతున్నట్లు కనిపిస్తుంది. ఆ శేషనాగు పడగవిప్పి నిల్చున్న భయంకరమైన విజువల్ కనిపిస్తుంది. పొలంలో ఓ గూడులో తెల్లని గుడ్లను కాపాడుతున్నట్లు ఆ శేషనాగు కాపలాగా ఉంది. ఇప్పుడీ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లక్షలాది వ్యూస్, షేర్లు వస్తున్నాయి. అయితే ఈ వీడియో నెటిజన్లు ఇది ఫేక్ వీడియో అని తేల్చి చెప్తున్నారు. కొందరు నెటిజన్లు ఇది ఐదు తలల అద్భుతమైన శేషనాగు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే అసలు నిజం ఏంటంటే ఈ వీడియో 2023లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీని అసలు వీడియోలో ఓ కోబ్రా పొలంలో కనిపించింది. ఆ పాము ఒక తలతోనే ఉండడం గమనార్హం. ఆ పామును వీడియోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఐదు తలలుగా మార్చినట్లు తెలుస్తోంది.
Also Read: Viral Video: అద్భుతం..కనకదుర్గమ్మ గుడిలో సింహం..అమ్మవారికి కాపలా..!
Also Read: Yashasvi Jaiswal: క్రికెటర్ యశస్వి జైస్వాల్ కాబోయే భార్య ఎవరంటే? ఇంగ్లీష్ పిల్లనే పడేశాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









