Viral Video: లుల్లు మాల్ వద్ద SUV హల్‌చల్.. స్కూటీని కిలోమీటర్లు లాక్కెళ్లిన వీడియో వైరల్..

SUV Viral Video: ఎస్‌యూవీ డ్రైవర్ బీభత్సం సృష్టించిన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింటా హల్‌చల్ చేస్తోంది. ఓ ఎస్‌యూవీ కారు డ్రైవర్ స్కూటీని ఢీకొట్టడంతో కొన్ని కిలోమీటర్ల లాక్కెళ్లాడు. దీంతో ఆ రోడ్డు మొత్తం నిప్పుల రవ్వలు కక్కాయి. ఆ వీడియో వైరల్ అవుతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Mar 26, 2025, 08:40 AM IST
Viral Video: లుల్లు మాల్ వద్ద SUV హల్‌చల్.. స్కూటీని కిలోమీటర్లు లాక్కెళ్లిన వీడియో వైరల్..

SUV Viral Video: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నా ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇష్టం వచ్చినట్లుగా డ్రైవింగ్ చేస్తూ పక్కవారి  ప్రాణాల మీదకు తీసుకువస్తున్నారు. అర్జెంట్‌ పని, తాగి వాహనం నడపడం, నిద్రమత్తు వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. యూపీలోని లక్నోలో కూడా ఓ ఎస్‌యూవీ డ్రైవర్ కారు బీభత్సం సృష్టించాడు. గత ఆదివారం రాత్రి అతివేగంగా డ్రైవింగ్ చేయడంతో పాటు పక్కనుంచి వెళ్తున్న స్కూటీని కూడా ఢీకొట్టాడు దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు ఆ స్కూటీ మీద ఉన్న ఇద్దరు గాల్లోకి ఎగిరిపడి తీవ్ర గాయాల పాలయ్యారు. స్కూటీని ఎస్‌యూవీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా లాక్కెళ్లడంతో ఆ రోడ్డు మొత్తం నిప్పురవ్వలు చెరిగాయి. ఈ వీడియో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు బ్రిజేష్‌ సింగ్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Add Zee News as a Preferred Source

ఈ షాకింగ్ ఘటన లక్నలో చోటుచేసుకుంది. వీడియో ప్రకారం ఆదివారం ఓ ఎస్‌యూవీ డ్రైవర్ వారణాసికి చెందిన ఇంజనీర్ బ్రిజేష్‌ సింగ్‌గా గుర్తించారు.  లక్నో లుల్లు మాల్ వద్ద ఈ బీభత్సం సృష్టించాడు. స్కూటీ మీద వెళుతున్న ఇద్దరినీ ఢీకొట్టడంతో వాళ్ళు గాల్లోకి ఎగిరిపడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా స్కూటీని కిలోమీటర్ల మేర లాక్కుని అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేశాడు. కారు ముందు భాగంలో ఆ స్కూటీ స్టక్ అయింది. అయినా కానీ, దాన్ని అలాగే లాక్కెళ్లాడు. దీంతో రోడ్డు మొత్తం నిప్పులు చిమ్మాయి. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. అయితే మాన్‌ సింగ్ అనే ఓప్రైవేటు ఉద్యోగి స్కూటీపై తన సోదరి ఇంటికి వెళ్తుండగా లుల్లు మాల్ వద్దకు చేరుకుగానే ఎస్‌యూవీ ఢీ కొట్టింది. దీంతో వారు గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. తీవ్రగాయలు కూడ అయ్యాయి. అయితే ఈ ఎస్‌యూవీ బీభత్సంతో రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు కూడా భయాందోళనకు గురయ్యారు. అయినా కానీ నిందితుడు బ్రిజేష్‌ సింగ్‌ ఏమాత్రం స్పందించకుండా వాహనాన్ని నడిపి హల్చల్ చేశాడు.

ఇదీ చదవండి:   Rajiv Yuva Vikasam: 'రాజీవ్ యువ వికాసం' అప్లై చేస్తున్నారా? ఈ కార్డు తప్పనిసరి, దరఖాస్తు విధానం ఇదే..

దాదాపు 11 కిలోమీటర్ల వరకు ఇలా ఇష్టానుసారంగా ఎస్‌యూవీ నడిపించాడు. డ్రైవర్ అయితే ఆ ట్రాన్స్‌పోర్ట్ నగర్‌కు చేరుకున్నాక సరోజి నగర్ పోలీసులు బారికేడ్‌ అడ్డుగా వేసి సదరు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు మనీష్‌ సింగ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే జైలుకు పంపారు. అయితే, అతను ఉద్యోగానికి హడావుడిలో ఇలా స్పీడ్‌గా వెళ్లాల్సి వచ్చిందని పోలీసులు ఎంక్వైరీలో తేలింది.. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. 

 

 

ఇదీ చదవండి:  Facial: ఇంట్లోనే కాఫీ ఫేషియల్‌.. ఖర్చులేని కాంతివంతమైన స్కిన్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News