)
Cow Leopard Attack Video: సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అయ్యే అడవి జంతువుల వీడియోలను చూడటానికి ప్రజలు చాలా ఆసక్తి చూపుతారు. తాజాగా ఓ చిరుతపులి, ఆవు మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన ఫైటింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.
ఇది ఓ తల్లి ప్రేమకు నిదర్శనంగా కనిపిస్తుంది. ఓ ఆవు తన బిడ్డను చిరుతపులి బారి నుంచి కాపాడేందుకు ఏకంగా తన ప్రాణాలనే పణంగా పెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆవు ధైర్యాన్ని, తల్లి ప్రేమను, ఆప్యాయతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఈ వీడియో ప్రకారం.. రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు. ఒక తల్లి ఆవు చిరుతను ధైర్యంగా ఎదుర్కొని తన బిడ్డను కాపాడిన సంఘటన ఇది. ఓ కారు అడవిలోకి సఫారీకి వెళ్తోంది. ఈ వీడియోలో.. చిరుతపులి దూడపై దాడి చేసింది. ఇది చూసిన తల్లి తన ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా పరిగెత్తి పులిని ఎదుర్కొంది.
ఆవు ఉగ్ర రూపాన్ని చూసి భయపడిన చిరుతపులి వెంటనే అక్కడి నుండి పారిపోయింది. ఆవు సకాలంలో స్పందించకపోతే ఆ లేగ దూడ చిరుతకు ఆహారంగా మారేది. ఈ సంఘటన పాలీలోని జవాయి చిరుతపులి అభయారణ్యంలో జరిగింది. ఒక వ్యక్తి ఈ వీడియోను Xలో షేర్ చేశాడు.
पाली के बाली में गाय के बछड़े को गर्दन से पैंथर ने
दबोचा तो बछड़े को बचाने #मां (गाय) बिना कोई
भय के दौड़ पड़ी। #Rajasthan pic.twitter.com/Bfjylq4lpP— अवधेश पाकड़?? (@AvPakad) August 1, 2025
"దూడపై దాడి చేసిన చిరుతపులిని ఆవు తల్లి తరిమికొడుతుంది" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత, నెటిజన్లు ఆవు ధైర్యం, తల్లి ప్రేమ, త్యాగాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook