
Woman Bike Riding Video: రోడ్లపై నిత్యం ఏదో సంఘటన జరుగుతూనే ఉంటుంది. ఏదైనా పెద్ద యాక్సిడెంట్ లేదా మరేదైనా విచిత్రమైన సంఘటన వంటివి తరచూ జరుగుతూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంటాయి. అలాంటి కోవకు చెందినదే ఈ వైరల్ వీడియో. ఈ వీడియో సోషల్ మీడియాని కుదిపేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో ఏంటో మీరూ చూసేయండి.
సాధారణంగా రోడ్లపై నేటి తరం యువత బైక్ స్టంట్స్ చేస్తుంటుంది. స్టంట్స్ అద్భుతంగా చేసినా.. కొన్నిసార్లు బొక్కబోర్లా పడి దెబ్బలు తిన్న పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబోయేది స్టంట్ వీడియో కాదు. ఓ మహిళ బైక్ నడిపిన వీడియో. అది కూడా చీరలో ఆమె స్పోర్ట్స్ బైక్ నడిపింది. కుర్రాళ్లు ఎంతో కష్టంగా నడిపే ఈ బైక్ ను ఆమె అవలీలగా నడిపేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం.. ఓ మహిళ తన చీరకట్టును ఎగ్గట్టి బైక్ నడిపేందుకు సిద్ధమైంది. అది కూడా స్పోర్ట్స్ మోడల్ బైక్ అది. దానిపై ఓ బాబును ముందు కూర్చొబెట్టుకొని బైక్ నడిపేందుకు సిద్ధమైంది. బైక్ కిక్ రాడ్ గట్టిగా కొట్టి స్టార్ట్ చేసింది ఆ మహిళ. అంతే ఎంతో సింపుల్‌గా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది.
ఈ వీడియోను ఇప్పుడు కొన్ని మీమ్ పేజెస్ వైరల్ చేశాయి. ఆ వీడియోకు " ఆంటీ కూడా బైక్ నడుపుతుందిరా నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు" అనే క్యాప్షన్‌తో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పుడా వీడియోకు కుప్పలుతెప్పలుగా లైక్స్ వస్తున్నాయి. స్పోర్ట్స బైక్ నడిపే ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook