Cobra Romance Video: గత 15 రోజులుగా ఉన్న భారీ వర్షాల కారణంగా అడవుల్లో ఆహారం లేకపోవడంతో.. పాములు జనావాస ప్రాంతాల్లో సంచరించడం ప్రారంభించాయి. కొన్ని ప్రాంతాల్లో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో, ఇంట్లో వంట చేస్తున్నప్పుడు వంటగదిలో కనిపించే సందర్భాలు ఉన్నాయి. ఆహారం ఉన్న చోట కొన్ని పాములు కనిపిస్తాయి. ముఖ్యంగా అడవికి దగ్గరగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో, ప్రమాదకరమైన పాములు కనిపిస్తాయి. ముఖ్యంగా అలాంటి పాములు ఇళ్లలోకి, తరచూ వాడే కార్లు, మోటార్ సైకిళ్లలో కనిపించే సందర్భాలు చాలా ఉన్నాయి.
సోషల్ మీడియాలో చాలా వీడియోలు చూశాం. ముఖ్యంగా సీట్ల కింద పాములు, మోటార్ సైకిళ్ల హెడ్ లైట్లలోకి పాకుతున్న వీడియోలు. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో వేరు. ఈ వీడియోలో HF డీలక్స్ బైక్ హెడ్ ల్యాంప్ లో రెండు చాలా ప్రమాదకరమైన కింగ్ కోబ్రాలు కనిపిస్తాయి. ఈ వీడియోని చూసిన నెటిజన్లలో చాలామంది షాక్ అయ్యారు.
10 సెకన్ల నిడివి గల ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. అటవీ ప్రాంతంలో పార్క్ చేసిన HF డీలక్స్ బైక్‌పై రెండు ప్రమాదకరమైన కింగ్ కోబ్రాలు సయ్యాట ఆడుతున్నాయి. ఆ రెండు పాములను పట్టుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. దీంతో ఆ రెండు పాములు అతడిపై బుసలు కొడతూ మీదికి వచ్చాయి. కొంత సమయం శ్రమించిన తర్వాత, వన్యప్రాణుల సంరక్షకులు చివరకు రెండు పాములను పట్టుకుని సురక్షితమైన ప్రదేశంలో వదిలేశారు. ఇప్పుడు ఈ వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది.
ALso REad: KGF Actor: కేజీఎఫ్ నటుడు కన్నుమూత..క్యాన్సర్‌తో ఆస్పత్రిలో చికిత్స..వైద్యం కోసం చేతిలో డబ్బు లేక..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









