Viral Video: అత్తపై కోడలి దాష్టీకం.. వృద్ధాశ్రమానికి వెళ్లలేదని.. వీడియో వైరల్‌..

Gwalior Viral Video: అత్తపై కోడలి దాష్టీకం వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించిందని మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆమెను కింద పడేసి దారుణంగా కొట్టింది ఓ కోడలు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూడండి..

Written by - Renuka Godugu | Last Updated : Apr 6, 2025, 09:23 AM IST
Viral Video: అత్తపై కోడలి దాష్టీకం.. వృద్ధాశ్రమానికి వెళ్లలేదని.. వీడియో వైరల్‌..

 Gwalior Viral Video: రోజురోజుకు మానవత్వం మంట కలుపుతోంది. బంధుత్వాలు కూడా దూరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్త మామలపై దాడులు కూడా తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ అత్తను కోడలు జుట్టు పట్టి లాగి తీవ్రంగా దాడి చేసింది. తల్లిలా చూసుకోవాల్సిన ఆమెను కింద పడేసి తీవ్రస్థాయిలో వీపుపై పిడుగుద్దులతో విరుచుకుపడింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Add Zee News as a Preferred Source

వివరాల్లోకి వెళితే.. అయితే విశాల్ బాత్రా అనే వ్యక్తి కారు స్పేస్ స్పేర్ షాప్ నిర్వహిస్తున్నారు. అతని తల్లి సరళ బాత్రా 70 ఏళ్ళు. ఆమెను తన భార్య నీలిక వృద్ధాశ్రమానికి పంపించమని చెప్పింది. అయినా బాత్రా తన తల్లి పట్టించుకోకపోవడంతో తనపై తన తల్లిపై భార్య తన బంధువలతో దాడి చేసిందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు బాత్రా. అయితే ఓల్డేజ్ హోమ్ కి పంపించడానికి తన భర్త తనను కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడికి గురి చేస్తోందని అతడు పోలీసులకు తెలిపాడు. 

ఇదిలా ఉండగా ఏప్రిల్‌ 1వ తేదీన తన అత్తను వృద్ధాశ్రమానికి పంపించనున్నట్లు నీలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆయన కొంతమంది వ్యక్తులతో కలిసి ఆదర్శ కాలనీలో ఉన్న తన కూతురి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం రాగానే అల్లుడు పై చేయి చేసుకోవడంతో గొడవ మొదలైంది. ఆయనతోపాటు వచ్చిన వ్యక్తులు కూడా అల్లుడు పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంలో నీలిక తన అత్తను కింద పడేసి ఘోరంగా కొట్టింది. అంతే కాదు జుట్టు పట్టి లాగి మెట్ల పక్కన పడేసి వీపుపై కూడా బాగా పిడిగుద్దులు గుద్దింది. అయితే అక్కడే ఉన్న కొడుకు బాత్ర తన తల్లిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన వీడియోలు కూడా నెట్ లో వైరల్ అవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో తల్లి కొడుకు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన అంతగా స్పందించలేదు. అయితే, మీడియాతో సరళ బాత్ర మీడియాతో మాట్లాడుతూ నేను నా కొడుకు తీవ్రస్థాయిలో వేధింపులకు గురయ్యాం.ఇక సహించేది లేదు వాళ్ళు రౌడీలను తీసుకువచ్చి మాపై దాడి చేశారు. నా కోడలు తండ్రి కూడా మమ్మల్ని కిందకు తోసేసి తీవ్ర స్థాయిలో కొట్టాడు. గత కొద్దిరోజులుగా చంపుతామని కూడా బెదిరిస్తున్నాడు అని ఆమె చెప్పింది. 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Our Gwalior™ (@ourgwalior)

 

 బాత్రా కూడా తన బావ కూడా అతన్ని పోలీస్ స్టేషన్‌లోనే చంపుతామని బెదిరింపులకు గురి చేశారని చెప్పాడు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఘటనకు సంబంధించి నీలిక ఆమె తండ్రి ఇంకా స్పందించలేదు. ఇలాంటి ఘటనే కొన్ని నెలల కొన్ని రోజుల క్రితం మీరాట్‌లో జరిగింది. నావీ అధికారిని భార్య ప్రియుడితో కలిసి ముక్కలుగా నరికేసి డ్రమ్ములో సిమెంట్‌తో ప్లాస్టింగ్ చేసిన ఘటన గుర్తు చేసుకున్నాడు బాత్ర. 

 

ఇదీ చదవండి: ట్రంప్‌ సర్కారుపై అమెరికావ్యాప్తంగా భారీ నిరసనలు.. వీడియో వైరల్

ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. ఈరాశికి కుటుంబ సమస్యల నుంచి కాస్త ఉపశమనం..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News