Two Lions Battle Video Watch: అడవుల్లో సింహాలు పులులు ఉండడం సర్వసాధారణమే.. అత్యంత క్రూరముగాల్లో సింహాలు ఒకటి. ఇవి ఆహారం కోసం ఏవైనా చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన జంతువులపై దాడి చేసే సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. అడవుల్లో సింహాలు కొన్ని జంతువులతో పాటు పక్షులను, చేపలను కూడా తింటూ ఉంటాయి. వాటికి తీవ్రంగా ఆకలేస్తే తోటి జంతువులను కూడా వదిలిపెట్టకుండా తింటూ ఉంటాయి. ఇది వాటి అరుదైన లక్షణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం చాలామంది అడవుల్లో ఉండే సింహాలను దగ్గరనుంచి చూసేందుకు జనరల్ జంగల్ సఫారీకి వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలోనే కొన్ని వీడియోలను మొబైల్ ఫోన్స్ లో చిత్రీకరించి పోస్ట్ చేస్తున్నారు. తాజాగా జంగల్ సఫారీకి వెళ్ళిన కొంతమంది సింహాలను చిత్రీకరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైరల్ అవుతున్న వీడియోలో అడవుల్లోకి జంగల్ సఫారీ కోసం బయలుదేరిన పర్యాటకులు.. మార్గం మధ్యలోనే కొన్ని అరుదైన దృశ్యాలు చూశారు. ఒక పెద్ద సింహం వారు ప్రయాణిస్తున్న కారు ముందు నుంచి పరిగెత్తడం వారు గమనించారు. అయితే అకస్మాత్తుగా ఇది జరగడంతో డ్రైవర్ కూడా దీనిని క్యాచ్ చేసుకొని.. వాహనాన్ని సింహం వెంట స్పీడ్ గా తీసుకెళ్లారు. అయితే కొన్ని సింహాలు ఒకేచోట గుంపు గుడడంతో పర్యాటకులకు ఆ వాహన డ్రైవర్ క్లియర్గా వాటిని చూపించాడు. అయితే అక్కడి నుంచి వారు కాస్త ముందుకు వెళ్లారు. అక్కడ రెండు సింహాలు కనిపించాయి. పెద్ద సింహాలు కావడంతో ప్రయాణికులు ఆగి వాటిని చూశారు.
ఆ రెండు సింహాలను ప్రయాణికులు ఆగి చూస్తూనే ఉండిపోయారు. అయితే ఇదే సమయంలో ఆ రెండు సింహాల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఆ రెండు మృగాలు గర్జిస్తూ ఒకదానికొకటి దాడికి దిగాయి దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'లయన్‌సైటింగ్స్' అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..దక్షిణాఫ్రికాలోని మాడిక్వే గేమ్ రిజర్వ్‌లో సఫారీకి వెళ్లిన పర్యాటకులు రెండు సింహాల మధ్య భీకర యుద్ధాన్ని చూశారు. అంతేకాకుండా అవి ఒకదానికొకటి అతి క్రూరంగా దాడి చేసుకోవడం కూడా వారు కళ్ళతో రియల్ గా చూశారు. ఆ రెండు సింహాలు గర్జిస్తూ ఒకదానికొకటి తీవ్రంగా దాడి చేసుకున్నాయి.
ఈ తీవ్ర దాడిలో రెండు సింహాలు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. సాధారణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే రెండు సింహాలు ఒకదానికొకటి దాడి చేసుకుంటూ ఉంటాయి. కానీ ఈ రెండు సింహాలు ఆహారం కోసం దాడి చేసుకుని ఉంటాయని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు భావిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని కొన్ని సింహాలు అయితే తమ బలమైన కాళ్లతో ఇతర సింహాలను దాడి చేసి చంపేసే సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంటాయట. ఇప్పుడు ఈ రెండు సింహాలకు సంబంధించిన భీకర యుద్ధం సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









