Leopards Vs Grizzly Bear Viral Video Watch: సాధారణంగా పులు, సింహాలు, చిరుతపులలకు మధ్య తరచుగా గొడవలు వస్తూనే ఉంటాయి. ఇందులో అడవి రాజైనా సింహాలు తరచుగా విజయం సాధిస్తాయి. నిజానికి కొన్ని జంతువులు సింహాలను కూడా బయపెడుతూ ఉంటాయి. ఇవి ఎంతో ధైర్యంతో ఉండడమే కాకుండా చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటాయి. ఇవి ఇతర జంతువులను సైతం చంపుకుని తింటాయి. ఇలాంటి జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజా వైరల్ అవుతున్న వీడియో కూడా ఈ కోవకు చెందినదే..
హనీ బ్యాడ్జర్ అనే చిన్న జంతువు గురించి చాలా మందికి తెలియదు. ఈ యానిమల్ చాలా తెలివైనది. అంతేకాకుండా ఇది తలపడితే.. ఇతర జంతువుల సంగతి అంతే.. వీటికి సింహాలను బయపెట్టే సామర్థ్యం కూడా ఉంటుంది. అంతేకాకుండా మంచి దూకుడు స్వభావం కలిగి ఉంటాయి. అందుకే ఈ జంవుతుకు ప్రపంచంలోనే అత్యంత నిర్భయ జంతువుగా పేరు పొందింది. దీనిని కొంతమంది గ్రిజ్లీ ఎలుగుబంటిగా కూడా పిలుస్తారు. ఇది చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ ఎంతో బలంగా ఉంటుంది.
Honey Badger don't care... Here's one taking on 3 Leopards and winning.. pic.twitter.com/0cGHkL0Ap1
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 31, 2025
తాజాగా గ్రిజ్లీ ఎలుగుబంటికి సంబంధించిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మూడు చిరుత పులులను చూడొచ్చు. అంతేకాకుండా అవి ఆ నల్ల ఎలుగుబంటిపై దాడి చేయడం గమనించవచ్చు. ఇందులోని చిరుత పులులు ఏకదాటిగా దానిపై దాడి చేస్తునే ఉన్నాయి. అయితే ఎలుగుబంటి ఏ మాత్రం భయం లేకుండా చిరుతలపై దాడి చేయడం మీరు చూడొచ్చు. ఇలా వీటి మధ్య దాడి దాదాపు 10 నుంచి 20 నిమిషాల పాటు కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఈ చిరుత పులులు, చిన్న ఎలుగు బంటికి సంబంధించిన వీడియో AMAZINGNATURE అనే X ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియోను ఏప్రిల్ 1వ తేదిన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 5.9 మిలియన్లకు పైగా నెటిజన్స్ వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇది జంవుతులు దాడి చేసుకుంటున్నట్లు లేదు.. కేవలం ఆ జంతువు ఆడుకుంటున్నట్లు ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









