True Love Elephants Viral Video: అత్యంత తెలివైన జంతువుల్లో ఏనుగులు కూడా ఒకటి.. ఇవి మనుషులు మాదిరిగానే ఒక భాగుద్వేగంతో జీవించే సామాజిక జీవులుగా పరిగణిస్తారు. వీటిని ద్వంద జీవులు అని కూడా అంటారు. ఎందుకంటే ఏనుగులు ఒక వయసుకు వచ్చిన తర్వాత మగ ఆడ ఏనుగులు కలిసి కట్టుగా జీవించి పిల్లలకు జన్మనిస్తాయి. అలాగే ఆడ మగ రెండు ఏనుగుల మధ్య కూడా మంచి ప్రేమ సంబంధం ఉంటుంది. వీటి ద్వంద జీవితంలో ఒకదానికంటే ఒకటి ఎక్కువగా ప్రేమను చూపిస్తూ ఉంటాయి. ఒక్క నిమిషమైనా ఒక ఏనుగు లేకుండా మరొక ఏనుగు ఉండదు. ఆహారం కోసం అయినా రెండు ఏనుగులు కలిసికట్టుగానే వెళుతూ ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు కూడా రెండు కలిసికట్టుగానే పరిష్కరిస్తాయి. బాధల్లో కూడా రెండు ఏమాత్రం స్నేహాన్ని విడిచి ఉండవు. తాజాగా రెండు ఏనుగులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వినియోగదారుల హృదయాలను పట్టి పిండేస్తోంది.
ఇటీవల రెండు ఏనుగులకు సంబంధించిన హృదయ విదారక దృశ్యం సోషల్ మీడియా వినియోగదారుల కళ్ళల్లో నీటిని తెప్పిస్తోంది. 25 ఏళ్లుగా కలిసి జీవిస్తున్న ఏనుగు జంటలో ఓ ఆడ ఏనుగు సడన్గా మృతి చెందుతుంది. దీన్ని తెలుసుకొని అక్కడే ఉన్న మగ ఏనుగు మృతదేహం ముందు వెక్కివెక్కి ఏడుస్తోంది. అంతేకాకుండా ఆ ఏనుగు బిగ్గరగా అరుస్తూ వింత వింత శబ్దాలు చేస్తూ ఏడవడం అందరిని బాధకు గురి చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు ఏనుగులు కలిసికట్టుగా ఉంటున్నాయట. ఎక్కడికి వెళ్లిన ఈ రెండు కలిసికట్టుగానే వెళ్లేవట. ఇంతలోనే ఇందులో ఉన్న ఆడ ఏనుగు మృతి చెందడంతో మగ ఏనుగు కంటతడి పెట్టుకోవడం అక్కడున్న స్థానికులకు కూడా ఎంతగానో బాధ కలిగించింది. ఈ హృదయ విదారక ఘటనను అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Retired circus elephant seen mourning and trying to comfort her partner of over 25 years after she had collapsed and passed away.
Jenny and Magda were performing partners in Russia for over 25 years.
When Jenny passed away this week, Magda refused to let veterinarians near her… pic.twitter.com/ipcOG0db7z
— Collin Rugg (@CollinRugg) March 14, 2025
ఈ ఘటన రష్యాలోని ఓ సర్కస్ పాయింట్లు జరిగింది గత 25 సంవత్సరాలుగా సర్కస్లో ఈ రెండు ఏనుగులు అద్భుతమైన ప్రజాధరణను పొందాయి. అయితే సర్కస్ జరిగిన తర్వాత ఆడ ఏనుగు జెన్నీ ఉన్నట్టుండి అనారోగ్యానికి గురైంది. ఎన్ని రకాల ఔషధాలు వినియోగించినప్పటికీ అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయింది. చివరగా మృతి చెందడంతో సహచర ఏనుగు తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.. ఈ పెండేనుగులు గత 25 సంవత్సరాల నుంచి ఒకే సర్కస్ పాయింట్ లో పని చేశాయని.. అలాగే రెండు కలిసి ఒకేసారి ఆహారం తినేవట.. ఇప్పుడు ఆడ ఏనుగు మృతి చెందడంతో గుండెలు పగిలేలా మగ ఏనుగు ఏడుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతోంది.
ఈ వైరల్ అవుతున్న వీడియోలు CollinRugg అనే X ఖాతా నుంచి షేర్ చేశారు. ఏనుగు తన ప్రియురాలని కోల్పోయిందని.. వెక్కివెక్కి ఏడుస్తుంది అంటూ క్యాప్షన్ రాసి పోస్ట్ చేశారు. ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు కళ్లనిండా నీటిని తెచ్చుకుంటున్నారు.. ఈ వీడియోను మార్చి 15న సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పటివరకు 17 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. అంతేకాకుండా వారి బాగోద్వేగాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. "ఈ రెండు ఏనుగులను చూస్తే నా మనసు చలించిపోతోందని, ప్రేమంటే వీటిదేనని" కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook