Viral Video: పురివిప్పి నృత్యం చేస్తున్న నెమలి.. వేటా దొరికిందిరా అని దూకిన పులి, ఉత్కంఠభరితమైన ఈ వీడియో చూడండి ..

Tiger And Peacock Video: సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు త్వరగా వైరల్ అవుతాయి. అందులో జంతువులకు సంబంధించిన వీడియోలు అంటే ఆసక్తి చూపుతారు.  అలాంటి మరో వీడియో ఎస్‌ఎంలో  వైరల్‌ అవుతుంది. ఒక నెమలి పురివిప్పి నాట్యమాడుతుంది. అప్పుడే పులి వచ్చి దానిపై దూకింది. పంజా విసిరింది ఆ తర్వాత ఏం జరిగిందో వీడియో చూడండి..

Written by - Renuka Godugu | Last Updated : Mar 9, 2025, 05:48 PM IST
Viral Video: పురివిప్పి నృత్యం చేస్తున్న నెమలి.. వేటా దొరికిందిరా అని దూకిన పులి, ఉత్కంఠభరితమైన ఈ వీడియో చూడండి ..

Tiger And Peacock Video: పురివిప్పి నృత్యం చేస్తున్న ఓ నెమలి వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. ఎందుకంటే అది పురివిప్పి నాట్యం చేస్తుండగా ఓ చిరుత పులి దానిపై దూకడానికి ప్రయత్నించింది.  అంతేకాదు పంజా కూడా విసిరింది. ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు త్వరగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పాములు, కోతి, జంతువులకు సంబంధించిన వీడియోలో విపరీతంగా షేర్ చేస్తారు. దానిపై రకరకాలుగా కామెంట్స్ సైతం పెడుతూ లైక్లు కూడా లక్షల్లో పెడతారు. అయితే అలాంటి వీడియో నేడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. అది నెమలి పులికి సంబంధించిన వీడియో.

Add Zee News as a Preferred Source

ఇదీ చదవండి:  హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. 30 గంటలుగా వాటర్‌ సప్లై లేక ప్రజల ఇబ్బందులు, జలమండలి తీవ్ర ఆగ్రహం..  

నెమలి అంటే అందానికి చిహ్నం. అది అరుస్తూ పురివిప్పి నృత్యం చేస్తే కనువిందుగా కనిపిస్తుంది. దాని అందం అంతా అంతా కాదు. ఇది శాకాహారి అయితే పులి గురించి చెప్పడానికి తక్కువ ఏం లేదు. అది చాలా స్పీడ్ గా పరిగెత్తి ఏ జంతువునైనా వేటాడే సత్తా కలిగింది. అలా వేటాడి పులి తన ఆహారం సంపాదించుకుంటుంది. ఇప్పుడు పులికి నెమలి కనిపించింది.. పురి విప్పి నృత్యం చేస్తున్న నెమలి కనిపించడంతో ఒక్క దూకు దానిపై దూకింది. అంతేకాదు పంజా కూడా విసిరింది. ఈ వీడియో వైరల్ అవుతుంది. అయితే ఇక్కడే ఒక  జిమ్మిక్కు జరిగింది. పులిని గమనించిన నెమలి వెంటనే ఎగిరి చెట్టుపై ఎక్కి కూర్చుంది.

ఇదీ చదవండి: SLBC Tunnel: ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్‌ డాగ్స్‌.. మరికొద్ది క్షణాల్లో...

అంతేకాదు దాని పక్కన ఉన్న ఇతర నెమళ్లు కూడా అదే బాట పట్టాయి. అవి కూడా వెంటనే అక్కడి నుంచి ఎగిరి పారిపోయాయి. దీంతో నోటి కాడికి వచ్చిన కూడు నోట్లోకి వెళ్లలేదే అని పులి తోక జార్చుకుని తిరిగి వెళ్ళిపోయింది. ఇక చెట్టుపైకి కూర్చున్న నెమలి అరుస్తూ పులినే చూసింది.   ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే పూర్తిగా నృత్యంలో మునిగిపోయిన నెమలి అసలు పులిని చూడలేదని అనుకుంటాం.. కానీ ఒక్కసారిగా ప్రమాదాన్ని పసిగట్టిన నెమలి ఒక్క దూకు చెట్టు పైకి దూకింది. తన ప్రాణాలను రక్షించుకుంది. అంటే శత్రువు ఎటువైపు నుంచి వచ్చి ఎలా దాడి చేస్తాడో అని నెమలి పసిగట్టగలిగింది. ఆ చాకచక్యంతోనే తన ప్రాణాలను కూడా దక్కించుకుంది. ఈ వీడియో ద లీడర్ ఇన్‌స్టాగ్రామ్ అనే పేజీలో పోస్ట్ చేశారు .క్షణాల్లో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది దీనిపై రకరకాలుగా కామెంట్స్ పెట్టు లైక్ కొడుతున్నారు..
 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News