Viral Video: నువ్వు నన్ను కెలికితే..నేనెందుకు ఊరుకుంటాను, వైరల్ అవుతున్న వీడియో
Viral Video: నన్ను కెలికితే నేనెందుకు ఊరుకుంటానంటోంది ఆ ఒంటె. ఏదో నా మానాన నేను పోతుంటే నన్ను కొట్టేందుకు ప్రయత్నిస్తావా..బాగా తీరిందా అన్నట్టుంది ఈ వైరల్ వీడియో.
Viral Video: నన్ను కెలికితే నేనెందుకు ఊరుకుంటానంటోంది ఆ ఒంటె. ఏదో నా మానాన నేను పోతుంటే నన్ను కొట్టేందుకు ప్రయత్నిస్తావా..బాగా తీరిందా అన్నట్టుంది ఈ వైరల్ వీడియో.
ఎక్కడిదో తెలియదు గానీ ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు (Indian Forest Service) చెందిన ఓ అధికారి తన ట్విట్టర్ హ్యాండిల్‌పై ఈ వీడియో పోస్ట్ చేశాడు. ఇన్‌స్టంట్ కర్మ అనే క్యాప్షన్ ఇచ్చాడు. కర్మ అంటే అదే కదా. మనం చేసిన దానికి ఫలితం అనుభవించడం. సైన్స్ పరంగా చెప్పాలంటే ప్రతి చర్యకు సమానమైన ప్రతి చర్య ఉంటుంది. లేదా ఇంకా పచ్చిగా చెప్పాలంటే నన్ను కెలికితే నేనెందుకు ఊరుకుంటాను అనవచ్చేమో.
ఈ వీడియోను అప్పుడే 75 వేలమంది వీక్షించారు. 555 ట్వీట్లు లభించాయి. 5 వేలకు పైగా లైక్స్ వచ్చేశాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇన్‌స్టంట్ కర్మ అనే ఒకే ఒక క్యాప్షన్ కూడా ఈ వీడియోకు సరిగ్గా సరిపోయినట్టుంది. ఏదో తన మానాన ఓ వీధిలోంచి తన పోతుంది ఓ ఒంటె. పక్కన కొంతమంది అదే దారిలో వెళ్తున్నారు. అందులోంచి ఓ వ్యక్తి ఉన్నట్టుండి..ఆ ఒంటె వెనుక భాగంవైపుకొచ్చి..తోకను పట్టుకునేందుకో లేదా కొట్టేందుకో ప్రయత్నించబోయాడు. అంతే మెరుపువేగంతో కేవలం పావు సెకన్ వ్యవధిలోనే..క్విక్ రియాక్షన్ ఇచ్చేసింది ఆ ఒంటె. తనను ఏదో చేస్తున్నాడని వెనక్కి తిరగకుండానే గ్రహించేసింది. వెనుకవైపున్న ఎడమ కాలితో..ఆ వ్యక్తి నడుం భాగంపై బలంగా తన్నింది (Camel hits a Man). అంతే..ఆ దెబ్బకు ఆ వ్యక్తి బోర్లా పడ్డాడు. ఈ వీడియోలో ఒంటె ఎంత సహజంగా ఆ పని చేసిందంటే..కనీసం వెనుదిరిగి కూడా చూడకుండానే..ఎడమ కాలితో తన్ని..ముందుకు వెళ్లిపోయింది. ఇదే మరి ఇన్‌స్టంట్ కర్మ (Instant Karma) అంటే. ఊరికే కెలికితే ఊరుకుంటానా మరి.
Also read: Bizarre News: చెవిలో బొజ్జింకతో మూడ్రోజులు నరకయాతన, ఆ తరువాత ఏమైంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook