)
Young Man Dangerous Train Stunt Viral Video Watch: ఇంటర్నెట్లలో ఫేమస్ అవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరగడంతో చాలామంది యువత దానిని ఆదర్శంగా తీసుకొని పిచ్చి చేష్టలు చేస్తున్నారు. కొంతమంది అయితే ఇంస్టాగ్రామ్ లో ఎక్కువగా వైరల్ అయ్యేందుకు వింత వింతగా ప్రవర్తించి రీల్స్ చిత్రీకరించి పోస్ట్ చేస్తున్నారు మరికొంతమంది అయితే చేయకూడని సాహసోపేతమైన పనులు చేసి వాటిని చిత్రీకరించి రీల్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ వీడియో ఇలాంటి సన్నివేశాలకు సంబంధించిందే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఓ యువకుడు రైల్లో సాహసోపేతమైన చర్యలకు పాల్పడుతూ రీల్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో? వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవల రీల్స్ గోలలో పడి చాలామంది రైలు కిందపడి, రైలు విద్యుత్ స్తంభాలను ఢీకొని, రైల్లో నుంచి జారిపడి మరణించిన సంగతి తెలిసిందే.. అయితే వీటికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా పారాలైన సంగతి కూడా అందరికీ తెలిసిందే. తాజాగా ఓ యువకుడు ఫేమస్ అవ్వడానికి వేగంగా వెళ్తున్న రైలు తలుపుల నుంచి వేలాడుతూ రీల్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని కాస్గంజ్ నుంచి కాన్పూర్‌కు ప్రయాణిస్తున్న సూపర్ ఫాస్ట్ రైల్ లో ఓ వ్యక్తి వీల్స్ కోసం కిటికీని పట్టుకొని వేలాడుతూ సాహసోపేతమైన చర్యలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆ వ్యక్తి అదుపుతప్పి కిందికి పడిపోయే క్రమంలో అందులోనే ప్రయాణిస్తున్న కొంతమంది అతని చేతులు పట్టుకున్నారు.
రైలు వేగంగా ప్రయాణిస్తుండడంతో ఆ యువకుడి చేతులు జారిపోయి, కిందికి పడిపోయే సమయంలో అందులోనే ఉన్న కొంతమంది ప్రయాణికులు అతని చేతిను పట్టుకున్నారు. చేతిని పట్టుకొని నెమ్మదిగా పైకిలాగే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రైలు వేగంగా ప్రయాణించడంతో వారు ఎంతగా పైకి లాగాలని ప్రయత్నించిన అతడు రైలు నుంచి వస్తున్న గాలి ద్వారా కిందికి వెళ్తూనే ఉన్నాడు. దీంతో అందులోనే ఉన్న కొంతమంది ప్రయాణికులు ఆ ట్రైన్ చైన్ లాగారు. చైన్ లాగడంతో ట్రైన్ ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆగిపోయింది. దీంతో ఆ యువకుడు అక్కడే దిగి మళ్లీ ట్రైన్ లోకి ఎక్కేశాడు. ఈ దృశ్యాలను తోటి ప్రయాణికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Man Slips While Performing Dangerous Stunt On Moving Train in Up pic.twitter.com/rDZvwulwhM
— Sayyad Nag Pasha (@nag_pasha) March 11, 2025
ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వీల్స్ తీస్తున్న వ్యక్తిపై దుమ్మెత్తి పోస్తున్నారు. వేగంగా కదులుతున్న ట్రైన్ లో ఇలా సాహసాలు చేయడం అంత మంచిది కాదని.. ప్రాణాలకే ప్రమాదం అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో పై రైల్వే సిబ్బంది కూడా స్పందించినట్లు తెలుస్తోంది.. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటామని రైల్వే అధికారులు ఇప్పటికి చాలాసార్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. ఇక మున్ముందు ఇలా చేసే వారిపై తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకోబోతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.