Today Viral Video: ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశపు ఆత్యద్భుతమైన ప్రతిభను కలిగి ఉంటారు అందుకే మన దేశం యువ ప్రతిభతో కూడుకున్న దేశంగా ఇతర దేశ ప్రజలు పిలుస్తూ ఉంటారు చాలామంది పిల్లలు చిన్న వయస్సులోనే వారికున్న జ్ఞాపకశక్తి ప్రతిభతో అనేక చిన్న చిన్న ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. కొంతమంది చిన్న వయసులోనే రోబోట్లను తయారు చేయడం, మరి కొంతమంది కోడింగ్ నేర్చుకోవడం వంటి అపారమైన ప్రతిభను కలిగి ఉంటారు. తాజాగా ఇలాంటి కొత్త ప్రతిభకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
తాజాగా ఇద్దరు అమ్మాయిలు ఎండు మిరపకాయలను చేతులతో కాకుండా ప్రత్యేకంగా తయారు చేసిన ఒక మగ్గం లాంటి యంత్రం సహాయంతో కోడిలా దంచడం మీరు గమనించవచ్చు. ఆ ఇద్దరి మహిళలకు ఉన్న తెలివితేటలను ఉపయోగించి ఆ యంత్రాన్ని తయారుచేసి కారంపొడిని దంచుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో @_hetals_art అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు.. ఇందులో ఇద్దరు యువతులు ఒక ఇటుకకు రాడ్ సహాయంతో తాడు కట్టి.. ఒక మహిళ అటు ఇటు లాగడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఆ రాడ్లు ఆగడంతో ఇటుక కూడా పైనకి కిందికి రావడం కనిపిస్తుంది. దానికిందే వారు కొన్ని ఎండుమిరపకాయలను పెట్టడంతో అవి పైనుంచి వచ్చే ఇటుక బరువుతో మిరపకాయలు కారం కోడిలా మారడం మీరు గమనించవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంస్టాగ్రామ్ నుంచి షేర్ చేసిన వీడియో ఇప్పుడు అన్ని మాధ్యమాలలో వైరల్ అవుతూ వస్తోంది. ఈ ఒరిజినల్ వీడియోను ఇప్పటివరకు రెండు లక్షల మందికిపైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోని చూసిన చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు.. కొంతమంది అయితే.. "మిరపకాయల కంటే రాయి ఎక్కువగా నరిగిపోతుందని" ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే "ఈ మిరపకాయ కారం మిశ్రమాన్ని తయారు చేయడానికి దాదాపు రెండు నుంచి మూడు ఏళ్లు కూడా పట్టొచ్చు" అని ఫన్నీగా కామెంట్స్ రాస్తున్నారు.. ఇలా చాలామంది ఫన్నీ కామెంట్ చేశారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









