Wild Elephant Chases 2 Forest Officers video: సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఆసక్తి చూపి చూస్తారు. అందులో పాములకు సంబంధించిన వీడియోలు మరింత ప్రత్యేకం. వాటిని వెతికి మరీ చూస్తారు. అలాంటి వీడియోలకు లైక్లు, కామెంట్లు కూడా చేస్తుంటారు. అలాంటి ఘటన కర్ణాటక హాసన్ జిల్లాలో జరిగింది. ఈ షాకింగ్ ఘటనలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులను ఓ కోపంతో ఉన్న ఏనుగు వెంబడించింది. దీంతో వాళ్లు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించిన కెమెరామెన్ మాత్రం ఏ మాత్రం భయపడకుండా పూర్తిగా వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కర్ణాటక హసన్ జిల్లాలోని బేలూరు తాలూకా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక ఏనుగు అడవి దారి తప్పి వ్యవసాయ భూమిలోకి అడుగుపెట్టింది. దీంతో అప్రమతమైన అటవీశాఖ అధికారులు దాన్ని వెంటనే అడవిలోకి పంపించేందుకు చర్యలు చేపట్టారు. అయితే కోపంతో ఊగిపోయిన ఏనుగు అధికారులను వెంబడించింది. దీంతో అటవీ శాఖ అధికారులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. అయితే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వాళ్ళు ప్రాణాల పోయే పరిస్థితి ఏర్పడేది. కానీ, ఇక్కడ వారు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు.
ఈ వైరల్ మీడియా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ప్రశాంత్, సునీల్ అనే ఇద్దరు అటవీశాఖ అధికారులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. వారిద్దరి వెనుక ఓ ఏనుగు కోపంతో ఊగిపోతు వెంబడిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేయగానే విపరీతంగా కామెంట్స్, లైకులు వస్తున్నాయి. అయితే ఈ అధికారులకు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఈ వీడియో రికార్డు చేసిన కెమెరామెన్‌ను మాత్రం సోషల్ మీడియా వేదికగా అందరూ పొగుడుతున్నారు. జాగ్రత్తగా ఉండి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నందుకు ఎంతో ధైర్యం కావాలి అంటే కామెంట్లు పెడుతున్నారు.
గతంలో కూడా ఓ ఏనుగు జెసిబి మిషన్ ఎత్తి పడేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని జలపైగురిలో చోటుచేసుకుంది. అక్కడ కూడా వీడియోని తీసి నెట్టింట షేర్ చేయగానే బాగా వైరల్ అయింది. తాజాగా ఈ వీడియో కూడా అవుతుంది. కోపంతో అటవీశాఖ అధికారులనే పరుగులు పరిగెత్తించిన ఈ ఏనుగు వీడియో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు త్వరగా వైరల్ అవుతాయి. ముఖ్యంగా జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిని ఆసక్తిగా చూస్తారు. ఇవి ఎప్పటికీ నెట్టింటా వైరల్ అవుతుంటాయి.
#कर्नाटक के हासन जिले में जंगली हाथी ने वन विभाग के कर्मियों को दौड़ाया, दोनों वनकर्मी किसी तरह अपनी जान बचाकर भागे।#Karnataka pic.twitter.com/E2NWX4VmwF
— Rohit Nandan Mishra (@RohitNandanMis3) March 18, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









