What is Man-Mum Trend: రీసెంట్‌గా కొత్త ట్రెండ్ ఏది కనిపెట్టినా.. వేగంగా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. కాస్త డిఫరెంట్‌గా ఉంటే.. అంతే వేగంగా అనుసరించేస్తున్నారు. తాజాగా చైనాలో ఓ కొత్త ట్రెండ్ పుట్టుకువచ్చింది. 'మ్యాన్-మమ్' (Man-Mum Trend) అనే కొత్త సంస్కృతి ప్రారంభమైంది. యువతులు 600 రూపాయలు చెల్లించి.. 5 నిమిషాల పాటు పురుషుడిని హాగ్ చేసుకుంటారు. చైనాలో యువతులు తమ దైనందిన జీవితంలో ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందడానికి 'మ్యాన్-మమ్'
కల్చర్‌ను కనిపెట్టారు. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తరువాత మాట్లాడించే వారు లేక ఒంటరిగా భావించే మహిళలు ఇలాంటి కౌగిలింతలు కోరుకుంటున్నారు. రూ.600 చెల్లిస్తే.. మ్యాన్-మామ్ పురుషుడు హగ్ చేసుకుంటారు.
ఐదు నిమిషాల కౌగిలింతకు 50 యువాన్లు (రూ.600) వరకు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్కృతి చైనాలో వేగంగా పెరుగుతోంది. అక్కడ యువతులు 'మ్యాన్-మమ్స్' అని పిలుచుకునే పురుషులను హాగ్ చేసుకునేందుకు బుక్ చేసుకుంటున్నారు. ఇది తమన దైనందిన జీవితంలో ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుందని చాలామంది యువతులు చెబుతున్నారు. హాగ్ చేసుకునేందుకు వచ్చిన వ్యక్తి ఎలాంటి ప్రశ్నలు అడగకుండా.. ఎలాంటి తప్పు చేయకుండా ఐదు నిమిషాలపాటు హాగ్ చేసుకుంటారని అంటున్నారు. కౌగిలింత తరువాత ఎంతో రిలాక్స్‌గా ఉంటుందని పేర్కొంటున్నారు.
ఎలా మొదలైందంటే..?
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) ప్రకారం.. మ్యాన్-మమ్ అనే పదాన్ని మొదట జిమ్‌కు వెళ్లే బలమైన పురుషులను సూచించడానికి ఉపయోగించేవారు. అయితే క్రమంగా ఈ పదానికి అర్థం పూర్తిగా మారిపోయింది. మ్యాన్-మమ్ అంటే.. తల్లిలాంటి ఓర్పు, మృదువైన హృదయం కలిగిన పురుషులను పిలిచేందుకు వాడుతున్నారు. ఒత్తిడికి గురైన ఒక విద్యార్థి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. తాను ఒత్తిడిని జయించేందుకు డబ్బులు చెల్లించి హగ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు రాసుకొచ్చింది. అలా తాను హాగ్ చేసుకున్న తరువాత ఎంతో రిలాక్స్‌గా ఉందని.. సురక్షితంగా ఉన్నట్లు భావించానని చెప్పింది. ఆ తరువాత పోస్ట్ తెగ వైరల్ కావడంతో చాలా మంది మహిళలు ఇలా హాగ్ చేసుకునేందుకు మ్యాన్-మమ్ పురుషుల కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు.
ఓర్పు, ఎత్తు, రూపాన్ని బట్టి తన ప్రాధాన్యతల ఆధారంగా పురుషుడిని యువతులు ఎంచుకోవచ్చు. ఇలాంటి హగ్స్ ఎక్కువగా బహిరంగ ప్రదేశాల్లో జరుగుతుందని చెబుతున్నారు. రూ.250 నుంచి రూ.600 (20 నుంచి 50 యువాన్లు) వరకు చెల్లిస్తారని అంటున్నారు. 'మ్యాన్-మమ్' పురుషులు ఎక్కువగా మెట్రోస్టేషన్లు, షాపింగ్ మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఉంటారు. ప్రస్తుతం చైనాలో ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది.
Also Read: Free scooter Scheme: రయ్ రయ్.. ! వారందరికీ గుడ్ న్యూస్.. ఉచిత స్కూటర్ స్కీమ్‌పై ఓ లుక్కేయండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.









