White King Cobra Snake Video Now: మనం తరుచుగా సాధారణ నాగుపాములను మాత్రమే చూసి ఉంటాం.. కానీ నాగుపాము జాతుల్లోనే వివిధ రకాల పాములు ఉంటాయి. ఇందులో చాలా పాములు విభిన్న కలర్స్‌లో ఉంటాయి. కొన్ని కింగ్ కోబ్రాలు గోధుమ కలర్‌లో ఉంటే మరికొన్ని పాములు నల్లగా కూడా ఉంటాయి. అయితే ఈ కింగ్ కోబ్రాల్లోనే ఎప్పుడైనా తెలుపు రంగులో ఉన్న పామును చూశారా? ఇలాంటి పాములు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైన పాములుగా కూడా చెప్పుకుంటారు.
సాధారణంగా తెలుపు రంగులో ఉండే కింగ్ కోబ్రా పామలను భారతీయులు స్వేత నాగులుగా కూడా పిలుస్తారు. అతి ప్రమాదకరమైన పాముల్లో ఇవి కూడా ఒకటి..ఈ పాములు సాధారణంగా కనిపించే నాగు పాముల జన్యుపరమైన కారణాల వల్ల తెలుపు రంగులో జన్మిస్థాయని నిపుణులు తెలుపుతున్నారు. దీనిని ల్యూసిజం అని కూడా అంటారు. ఈ పాము శరీరాల్లో మెలనిన్ అనే వర్ణద్రవ్యం తక్కువ మోతాదులో ఉండడం వల్ల తెలుపు రంగులోకి మారుతుందని సమాచారం. కొన్ని పాముల బాడీ తెలుపు రంగులో ఉండడం వల్ల కళ్లు కూడా తెలుపు రంగులోకి మారుతాయి.
సాధారణ నాగు పాములతో పోలిస్తే తెలుపు నాగు పాములు చాలా అరుదుగా కనిపిస్తాయి. అంతేకాకుండా ఇవి ఆహారం కూడా చాలా అరుదుగా తీసుకుంటాయని సమాచారం. అలాగే వీటికి అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో తెలుపు రంగు నాగు పాములను అదృష్టానికి సూచికగా కూడా భావిస్తారు. అందుకే ఎక్కడ కనిపించిన, వాటిని చంపకుండా వదిలెస్తూ ఉంటారు. అలాగే ఇళ్లలోకి వచ్చిన చంపకుండా బయట వదిలిపెడతారు. గతంలో ఇలాంటి సంఘటనలకు సంబంధించిన అనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా ఓ తెలుపు రంగుకు సంబంధించిన వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో వైట్ కింగ్ కోబ్రా బుసలు కొట్టడం మీరు గమనించవచ్చు. ఈ వైరల్ అవుతున్న వీడియోను @న్యూఇంగ్లాండ్ రెప్టైల్ అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోకి లిలిత్ అనే తెల్లటి కింగ్ కోబ్రాను అని కాప్షన్ పెట్టి పోస్ట్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









