)
White Viper Snake Video Watch Here Now: తరచుగా మనం ఎన్నో రకాల పాములను చూస్తూ ఉంటాం.. చాలామంది వివిధ రకాల రంగులతో కూడిన పాములను చూస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలావరకు వింత రంగులతో కూడిన పాములు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మీరు గమనించవచ్చు. అయితే అన్ని రంగుల పాములు చూసినప్పటికీ.. తెలుపు రంగుతో కూడిన పాములు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. తెలుపు రంగులో కూడిన పాములు అరుదైన జాతులకు సంబంధించినవి. కాబట్టి భూమి మీద కూడా ఇవి అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. దీనిని వైట్ స్నేక్ అని కూడా అంటారు.. ఈ తెలుపు రంగులో ఉండే కొన్ని పాములు చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఇప్పటికీ ఆ అమెజాన్ అడవుల్లో జీవిస్తూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఈ వైట్ స్నేక్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అరుదైన జాతికి సంబంధించిన ఈ తెల్ల పాము కు సంబంధించిన వీడియో 'tetamzcute’ అనే యూట్యూబ్ ఛానెల్ నుంచి షేర్ చేశారు. వీడియోలో చూసినట్లయితే ఈ పాము పచ్చని మైదానంలో ఎంతో ప్రశాంతంగా అటు ఇటు తిరగడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా పైకి లేచి కెమెరా వైపు చూడడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాజాగా ఈ సన్నివేశాలకు సంబంధించిన పాము వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఆరుదైన జాతికి సంబంధించిన పామును కొంతమంది ఆగ్నేయాసియా లో ని అడవుల్లో సంచారం చేస్తున్న సమయంలో కనిపించడంతో వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు.. పాము భలే ముద్దుగా ఉందని లైకుల వర్షం కురిపిస్తున్నారు.
సాధారణంగా తెలుపు రంగులో ఉండే ఈ వైపర్స్ చాలా ప్రమాదకరమని కొంతమంది శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇది మనుషులపై దాడి చేస్తే దీని విషయంలో ఉండే పవర్ మనిషి నరాలను దెబ్బతీయటమే కాకుండా మెదడును కూడా దెబ్బతీస్తుందని వారు అంటున్నారు. అలాగే గోధుమ రంగులో ఉండే కొన్ని వైపర్స్ వీటికి అంటే చాలా ప్రమాదకరమైనవని.. అవి దాడి చేసిన క్షణాల్లోనే మరణించే అవకాశాలు కూడా ఉన్నాయి. నిజానికి ఇలాంటి పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.