Viral news: పచ్చని కాపురంలో గడ్డం చిచ్చు..!.. క్లీన్ షేవ్‌తో ఉన్న మరిదితో నవవధువు ఏంచేసిందంటే..?

Wife angry on husband beard:  మేరఠ్ లోని ఒక నవవధువు..  భర్తతో కొన్నిరోజులుగా గడ్డం విషయంలో  గొడవకు దిగింది. ఈ క్రమంలో తన మరిదితో సన్నిహితం ఏర్పడింది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.  

Written by - Inamdar Paresh | Last Updated : May 1, 2025, 11:03 AM IST
  • యూపీలో వెరైటీ ఘటన..
  • మరిదితో నవవధువు పరార్..
Viral news: పచ్చని కాపురంలో గడ్డం చిచ్చు..!.. క్లీన్ షేవ్‌తో ఉన్న మరిదితో నవవధువు ఏంచేసిందంటే..?

Wife angry on husband beard in uttar Pradesh: ఇటీవల కాలంలో చాలా మంది పెళ్లికున్న పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. పెళ్లి చేసుకుని చిన్న చిన్న విషయాల్లో గొడవలతో తమ కాపురాన్ని బజారున పడేసుకుంటున్నారు. కొంత మంది ప్రతిచిన్న ఘటనను భూతద్దంలో చూస్తుంటారు. కొంత మంది మహిళలు భర్తల్ని వేధిస్తే.. మరికొన్ని చోట్ల భార్యలు.. తమ భర్తల్ని రాచిరంపాన పెడుతున్నారు.

Add Zee News as a Preferred Source

ఇటీవల కాలంలో చాలా చోట్ల.. భార్యలు భర్తల్ని హింసిస్తున్న ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో.. కొన్ని చోట్ల భర్తలు ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు. ఇక భార్యలు కూడా తామేంతక్కువ తిన్నామా అన్న విధంగా  భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధాలకు  దిగుతున్నారు.  ఈ క్రమంలో ప్రస్తుతం ఒక యూపీలో ఒక మహిళ భర్తకు గడ్డం ఉందని ప్రతిరోజు గొడవలకు దిగింది. చివరకు భర్త మాట విన్పించుకోక పోవడంతో ఏకంగా మరిదితో పారిపోయింది.

ఉత్తర్​ ప్రదేశ్ లోని మేరఠ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మేరఠ్ కు చెందిన షకీర్ అనే వ్యక్తికి ఏడునెలల క్రితం .. అర్షి అనే యువతితో పెళ్లి అయ్యింది. పెళ్లి అయిన తొలి రాత్రి నుంచి నవవధువు భర్తను గడ్డంతీసేయాలని డిమాండ్ చేసింది.

కానీ అతను మాత్రం పట్టించుకోలేదు. గడ్డంతీస్తేనే బెడ్ మీద  ఆ పనికి ఒప్పుకుంటానని.. భార్య కండీషన్ కూడా పెట్టిందంట. కానీ అతను మాత్రం వినకుండా.. ప్రతిరోజు భార్యతో గడ్డం విషయంలో గొడవలకు దిగి బలవంతం చేసేవాడంట. దీంతో ఆమె భర్తమీద కోపంతో.. క్లీన్ షేవ్ ఉన్న అతని సోదరుడితో తరచుగా మాట్లాడేది. ఇది కాస్త ఇద్దరి మధ్య సాన్నిహిత్యంపెరిగి.. ఎఫైర్ వరకు వెళ్లింది.

Read more: Jaipur Drunk Girl Video:  ప్లీజ్ వదిలేయండి.. ఒకరి ప్రాణం తీసి వేడుకుంటున్న లిక్కర్ పాప.. వీడియో వైరల్..

ఈ క్రమంలో ఇద్దరు కూడా ఇటీవల పారిపోయారు. దీంతో భర్త షకీర్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేవలం గడ్డం విషయంలో గొడవ పెట్టుకుని,క్లీన్ షేవ్ ఉన్న తన తమ్ముడితో అర్షి పారిపోయిందని చెప్పాడు..  తన భార్య అర్షి 12వ తరగతి వరకు చదువుకుందని, ఇప్పుడు కాలేజీకి వెళ్తోందని మౌలానా షకీర్ తన ఫిర్యాదులో పోలీసులకు చెప్పాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News