Wife Attacks video: మగాళ్లకు సెఫ్టీలేనట్లేనా..?.. భర్తను ఇష్టమున్నట్లు కొడుతూ, కాలితో తన్నుతున్న భార్య.. షాకింగ్ వీడియో..

Wife assaulted husband in Panna: మధ్య ప్రదేశ్ లో కట్టుకున్న భార్య రెచ్చిపోయింది. తన భర్తను ఇష్టమున్నట్లు కొడుతూ, కాలితో తన్నుతూ నీచంగా ప్రవర్తించింది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన  నెటిజన్లు ఆవేశంలో రగిలిపోతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 2, 2025, 08:55 PM IST
  • భర్తపై అమానుష దాడి..
  • చర్యలు తీసుకొవాలని నెటిజన్ ల డిమాండ్..
 Wife Attacks video: మగాళ్లకు సెఫ్టీలేనట్లేనా..?.. భర్తను ఇష్టమున్నట్లు కొడుతూ, కాలితో తన్నుతున్న భార్య.. షాకింగ్ వీడియో..

Wife brutally beats and attacks on husband in panna: ఇటీవల కాలంలో చాలా మంది యువత అసలు పెళ్లంటేనే భయంతో దూరంగా పారిపోతున్నారు.  భార్యల వేధింపులు తాళలేక చాలా మంది భర్తలు సెల్పీ వీడియోలు తీసుకుని మరీ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.మొత్తంగా ఒకప్పుడు భర్తలు, భార్యల్ని వేధించేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందో ఏంటో కానీ.. చాలా చోట్ల పెళ్లి చేసుకుని భర్తలు నానా పాట్లు పడుతున్నారు.

Add Zee News as a Preferred Source

భార్యలు తమ భర్తలు బంగారం తెవట్లేదని, తమను బాగాచూసుకొవడంలేదని వేధింపులకు గురిచేస్తున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం చట్టాలు కూడా మహిళలకు ఫెవర్ గా ఉంటున్నాయి. దీన్ని కూడా చాలా మంది మిస్ యూస్ చేస్తున్నారు. తాజాగా.. ఒక భార్య.. తన భర్తను కుక్కను కొట్టినట్లు కొడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.
ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని పన్నాలో చోటు చేసుకుంది.

 

మధ్య ప్రదేశ్లోని పన్నాకు చెందిన లోకేష్‌ సమీప గ్రామంలో ఉండే హర్షిత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు యువతి కుటుంబం చాలా పేదవారు కావడంతో కట్నం కూడా తీసుకొలేదు. మొత్తంగా యువతి తన ఇంటికి వస్తే అంతేచాలనుకున్నాడు.తనకు ఉన్నదానిలో యువతిని బాగా చూసుకుంటున్నాడు. కానీ ఇంతలో ఏంజరిగిందో కానీ.. పెళ్లైన కొన్నిరోజులు బాగానే ఉన్నా.. ఇటీవల భర్తను వేధింపులకు గురిచేయడంస్టార్ట్ చేసింది. వీళ్ల పెళ్లి 2023లో జరిగింది. కొన్ని నెలల తర్వాత ప్రతిరోజు భర్తకు చుక్కలు చూపిస్తుంది.

తనకు బంగారం, కొత్త ఇల్లు కొనివ్వాలని.. కూడా వేధించేది. ప్రాపర్టీ తన పేరు మీద రాయాలని.. భార్య, అత్త, బావమరిది రోజు వేధించేవారు. ఇంట్లో వాళ్లకు చెప్పలేక.. అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇక లాభంలేదని.. తన భార్య వేధింపులను బైటపెట్టాలని సీక్రెట్ కెమెరా పెట్టాడు. దానిలో సదరు మహిళ భర్తను ఘోరంగా కొట్టడం వంటి ఘటనలు రికార్డు అయ్యాయి.

Read more: Snake Video: ఈ పాము మరీ చిలిపిగా ఉందే..!.. బాత్రూమ్ లోకి వెళ్లి మరీ యువకుడ్ని.. వీడియో వైరల్..

ప్రతిరోజు భర్తను మహిళ శారీరకంగా, మానసికంగా హింసిస్తుందని కూడా అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. దయచేసి తనకు న్యాయం చేయాలని కూడా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు . వెంటనే ఆమెపై చర్యలు తీసుకొవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రస్తుతం పోలీసులు ఆరాతీస్తున్నట్లు తెలుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News