uttar Pradesh constable blames his wife on late arrival: సాధారణంగా వైవాహిక జీవితంలో భార్యభర్తల మధ్య గొడవలు కామన్ గా వస్తుంటాయి. కొంత మంది వీటిని మాట్లాడుకుని పరిష్కరించుకుంటారు. మరికొందరు మాత్రం.. కట్టుకున్న వారిపై తమ షాడిజం చూపిస్తుంటారు. పదే పదే గొడవలు పడుతు, ఎవరికి కూడా మనశాంతి లేకుండా చేసుకుంటారు. కొంత మంది గొడవలు పడి విడిపోతుంటారు. మరికొందరు మాత్రం ఒకే ఇంట్లో ఉండి ఒకరికి మరోకను నరకం చూపించుకుంటారు. ఇలాంటి ఘటనలు చివరకు హత్యలు చేయడం, సుపారీ గ్యాంగ్ తో మర్డర్ లు చేయించడం వరకు కూడా వెళ్తుంటాయి.
ఇంట్లో గొడవలు ఉంటే.. మహిళలైన, పురుషులైన ఆఫీసులలో సరిగ్గా ఉద్యోగాలు చేసుకొలేదు. మొత్తంగా వీరి ఇంట్లో గొడవలు చేసే పనుల మీద పడుతాయి. తాజాగా.. ఉత్తర ప్రదేశ్ లో ఒక పోలీసు కానిస్టేబుల్ ప్రతిరోజు విధులకు ఆలస్యంగా వస్తున్నాడు. డ్యూటీ కూడా సక్రమంగా చేయడంలేదు. అంతేకాకుండా.. యూనీఫామ్ కూడా సరిగ్గా వేసుకొకుండా.. పీఎస్ కు వస్తున్నాడు.
ఈ క్రమంలో ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకున్నారు. పోలీసు జాబ్ అంటేనే.. క్రమశిక్షణకు పెట్టిందిపేరుగా చెప్తుంటారు. కానీ సదరు పోలీసు కానిస్టేబుల్ ఈ విధంగా రావడంతో పోలీసులు చర్యలకు దిగారు. అసలు విధుల్లో ఇంత నెగ్లీజెన్సీగా ఉండేందుకు కారణమేంటని రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
దీనిపై కానిస్టేబుల్ పోలీసులకు ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సదరు కానిస్టేబుల్ కు తన భార్యతో గొడవలు ఉన్నాయి. దీంతో ఆమె గొడవలు పడి పుట్టింటికి వెళ్లిపోయింది.
అయితే.. ఆమె ప్రతిరోజు కలలోకి వచ్చి ఛాతీమీద కూర్చుని రక్తం తాగుతుందని, ఆమె వల్ల నిద్ర ఉండటంలేదని వాపోయాడు. తనను మెంటల్గా టార్చర్ చేస్తుందని కూడా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు తన గొడును చెప్పుకున్నాడు. ప్రస్తుతం యూపీ కానిస్టేబుల్ తన ఉన్నతాధికారులకు చెప్పుకున్న గొడు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









