Cat burn alive in uttar Pradesh: టెక్నాలజీ ప్రతిరోజు అప్ డేట్ అవుతు ముందుకు వెళ్తుంటే.. ఇప్పటికి కొంత మంది మాత్రం.. మూఢనమ్మకాల ముసుగులో ఉంటున్నారు. ఇప్పటికి చేతబడి, బాణామతి, దెయ్యాలు, భూతాలు ఉన్నాయని చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారు. దొంగ బాబాల బారిన పడిన కోట్లల్లో నష్టపోతున్నారు.
అమాయకుల నమ్మకాల్ని ఆసరాగా చేసుకుంటున్న కొంత మంది చేస్తున్న మోసపు పనుల వల్ల.. కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. చాలా మంది పిల్లిని ఒక చెడు సూచకంగా భావిస్తారు. అంతేకాకుండా.. నక్క అరుపులు, కుక్క ఏడుపులు, కాకి ఇంటి మీద వాలి అరవడం అశుభంగా భావిస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతంఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఒక షాకింగ్ ఘటనచోటు చేసుకుంది.
ఉత్తర ప్రదేశ్‌లోని మోరాబాద్ జిల్లా భోజ్‌పూర్ ప్రాంతానికి చెందిన కొంత మంది మహిళలు టూర్ కు బైక్ మీద వెళ్లాలని ప్లాన్ చేశారు. ఇంతలో అన్ని అరెంజ్ మెంట్స్ చేసుకుని ఇంటిబైటకు వచ్చారు. ఇంతలో వారి మార్గానికి ఒక పిల్లి అడ్డంగా వచ్చింది. దీంతో కోపంతో రగిలిపోయారు.
ఆ పిల్లి వెంట పడి దాన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత పిల్లిని సజీవంగా పెట్రోల్ పోసీ మరీ దహనం చేశారు. అంతే కాకుండా.. తమ పైశాచీకంను ఫోటోలు, వీడియోలను రికార్డు చేసుకుని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అది కాస్త వైరల్ కావడంతో దీనిపై పెటా, జంతు ప్రేమికులు సీరియస్ అయ్యారు. వెంటనే పోలీసులు వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.
Read more: Snake Viral Video: కోడి గుడ్డును మింగి నరకం చూసిన పాము.. చివరకు ఏమైందంటే..?.. వీడియో వైరల్..
నోరులేని మూగ జీవిని హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా యువతులు చేసిని పనిని సోషల్ మీడియా వేదికగా చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









