Woman bathing lion like small kid video: సాధారణంగా మనం ఇళ్లలో కుక్కలు, పిల్లులు, మేకలు, రామ చిలుకల్ని పెంచుకొవడం వంటివి చూస్తుంటాం. కానీ ఇటీవల వెరైటీగా కొంత మంది పాములు, కొండ చిలువలు, క్రూర జంతువులు, ఏనుగుల్ని సైతం తమ ఇళ్లలో పెంచుకుంటున్నారు. అయితే.. వీటిని చిన్నతనం నుంచి పెంచడం వల్ల అవి యజమానులపై దాడులు చేయకుండా.. వారు చెప్పింది వింటు ఉంటాయి.
ఇదంతా మనం రోటీన్ గా చూస్తుంటాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక మహిళ ఏకంగా అడవికి రాజైన సింహన్ని తన ఇంట్లో పెంచుకుంటుంది. అంతేకాకుండా... దానికి చిన్న పిల్లల్ల స్నానం కూడా చేయించింది.
ఆ సింహం కూడా.. ఆమె పైప్ తో స్నానం చేయిస్తుంటే.. ఎటు కదలకుండా.. తీరిగ్గా నిలబడి మరీ స్నానం చేయించుకుంటుంది. మరీ సింహం తన సహాజమైన క్రూరత్వంను మర్చిపోయిందో లేదా.. తన యజమాని ప్రేమకు ఫిదా అయిపోయిందొ కానీ.. ఆమె ఎలా చెబితే అలా చేస్తుంది.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం.. అరె వావ్.. సింహన్ని భలే కంట్రోల్ లో పెట్టుకుందిగా అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
మనిషి తలుచుకుంటే.. తన ప్రేమతో క్రూరమైన జంతువుల్ని సైతం తమ వశం చేసుకుంటారని మరికొందరు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.









