Snakes Bathing Video: వావ్.. పాములకు చంటి పిల్లల్లా స్నానం చేయిస్తున్న మహిళ.. వీడియో వైరల్..

Cobra Snake viral video: మహిళ పాముల్ని నీళ్లలో ముంచుకుంటు స్నానం చేయిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నువ్వు గ్రేట్ తల్లి అంటూ కామెంట్లు పెడుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 26, 2025, 04:31 PM IST
  • దంచికొడుతున్న ఎండలు..
  • పాములకు స్నానం పోస్తున్న మహిళ..
Snakes Bathing Video: వావ్.. పాములకు చంటి పిల్లల్లా స్నానం చేయిస్తున్న మహిళ.. వీడియో వైరల్..

Woman bathing Pet Cobra snakes video: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. మనుషులు భానుడి ప్రతాపానికి విలవిల్లాడిపోతున్నారు. అంతే కాకుండా.. అసలు ఇంటి నుంచి బైటకు వెళ్లాలంటేనే పదిసార్లు ఆలోచిస్తున్నారు . అత్యవసరం అయితే... తప్ప బైటకు వెళ్లేందుకు సాహాసం చేయడంలేదు. మొత్తంగా పాముల వీడియోలు ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. మనం ఎండల నుంచి కాపాడుకొవడానికి నీళ్లు ఎక్కవగా తాగుతుంటాం.

Add Zee News as a Preferred Source

అంతే కాకుండా.. ఒకటిని రెండు సార్లు స్నానాలు చేస్తుంటాం . అయితే.. చాలా మంది తమ ఇళ్లలో కుక్కలు, పిల్లుల్ని పెంచుకుంటుంటారు. ఈ క్రమంలో వాటిని సమ్మర్లో స్నానం చేయిస్తుంటారు. ఇదంతా మనం రెగ్యులర్ గా చూస్తునే ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం వెరైటీగా ఒక వీడియో వైరల్గా మారింది. దీనిలో ఒక మహిళ పాముకు స్నానం చేయించింది.  మరీ ఆమె పాముల్ని పెంచుకుంటుందో మరేంటో కానీ.. ఆమె చుట్టుదా చంటి పిల్లల్లా పాములు ఉన్నాయి.

 

తన ముందు ఒక గిన్నెను పెట్టుకుని పామును  దాంట్లో ముంచుకుంటూ బైటకు తీసింది.  అదేదో అచ్చం ..చంటి బిడ్డలకు స్నానం చేయించినట్లు మహిళ ప్రవర్తించింది. ఆ పాముల్ని పట్టుకుని దాన్ని ఒకదాని తర్వాత మరోకటిని నీళ్లలో ముంచుతూ పాములకు స్నానం చేయించింది.

Read more: Pahalgam Animation Video: పహల్గం ఘటన.. ప్రతి ఒక్కర్ని రక్తం మరిగేలా గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో ఇదే..

అయితే.. ఇక్కడ పాములు కూడా ఆమెను చూస్తు పెరిగాయో.. మరేంటో కానీ.. అసలు.. ఆమె మీద బుసలు కూడాకొట్టడం లేదు. ఏంచక్కా స్నానం చేయించుకుంటున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు నువ్వు తోపు తల్లి.. పాముల్ని కూడా ఇంత ప్రేమగా చూసుకుంటున్న వాళ్లు ఎక్కడ ఉండరమ్మా.. అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News