Woman bathing with big python in washroom Video: ఇటీవల చాలా మంది వెరైటీగా ప్రవరిస్తున్నారు. ఒకప్పుడు కుక్కలు, పిల్లుల్ని ఇంట్లో పెంచుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం క్రూర జంతువులు, విషపు జంతువుల్ని సైతం కొంత మంది తమ ఇళ్లలో పెంచుకుంటున్నారు. ఇలాంటి పనులు చేస్తు తమ లైఫ్ ను డెంజర్ లో పడేసుకుంటున్నారు. మొత్తంగా ఇటీవల పాములు, కొండ చిలువల వీడియోలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి.
ముఖ్యంగా కొంత మంది కొండచిలువల్ని సైతం అదేదో పెంపుడు జంతువుల్లా పెంచుకుంటున్నారు. తమ ఇంట్లో బెడ్ మీద పెట్టుకుంటున్నారు. మరికొందరు హాల్ లోకూడా తమ మెడలో కొండ చిలువల్ని వేసుకుని వింతగా ప్రవర్తిస్తున్నారు. అయితే.. కొన్నిసార్లు వీళ్ల పనులు డెంజర్ లో నెట్టేవిగా ఉంటాయి.
తాజాగా.. ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీనిలో ఒక అందమైన యువతి.. భారీ కొండ చిలువతో బాత్రూమ్ లోని ట్రబ్ లో స్నానం చేస్తు హల్ చల్ చేసింది. అదేదో.. బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసినట్లు కొండ చిలువను తన ఒళ్లొ పెట్టుకుని దానికి స్నానం చేయించింది.
అంతటితో ఆగకుండా.. దానికి ముద్దులు పెడుతూ కూడా రచ్చ రచ్చ చేసింది. ఆ కొండ చిలువ కూడా ఆమెతో ప్రేమలో పడిందో మరేంటోకానీ.. ఆమె ఎట్టా చేస్తే అట్టా కదులుతు ఉంది. మొత్తంగా పైథాన్, మహిళలు బాత్రూమ్ లో చేస్తున్న రచ్చ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బిత్తరపోతున్నారు. మరికొందరు నీకు కొండ చిలువనే దొరికిందా.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.









