Woman falls from bike Video: బైకర్ మంచి చెప్తుంటే.!. సైట్ కొడ్తుండని ఫీలయ్యింది.. చివరకు నడి రోడ్డు మీద ఇలా.. షాకింగ్ వీడియో...

Woman saree stuck in bike wheel:  మహిళ బైక్ మీద వెళ్తుంది. ఇంతలో ఆమె చీర బైక్ చక్రంలో ఇరుక్కుంటుంది. వెనుక నుంచి వస్తున్న వ్యక్తి కేకలు పెడుతూ చెప్తున్నాడు. అయిన కూడా ఆమె వినలేదు. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 28, 2025, 04:38 PM IST
  • బైక్ మీద నుంచి పడిపోయిన మహిళ..
  • జాగ్రత్తగా ఉండాలని నెటిజన్ల కామెంట్లు..
Woman falls from bike Video: బైకర్ మంచి చెప్తుంటే.!. సైట్ కొడ్తుండని ఫీలయ్యింది.. చివరకు నడి రోడ్డు మీద ఇలా.. షాకింగ్ వీడియో...

woman falls from running bike video: మహిళలు చాలా మంది బైక్ ల మీద జర్నీలకు ఇష్టపడుతుంటారు. మనం తరచుగా అమ్మాయిలు వాళ్ల ఫ్యామిలీ వాళ్లు, లేదా ఫ్రెండ్స్ తో బైక్ ల మీద వెళ్తుండటం చూస్తుంటాం. అంతేకాకుండా.. కొన్నిసార్లు.. లవర్ లతో కూడా చాలా మంది బైక్ ల మీద వెళ్తు రొమాన్స్ లకు దిగుతుంటారు. అయితే.. అమ్మాయిలు జీన్స్ , పంజాబీ డ్రెస్ లు, ఇతర డ్రెస్ లు వేసుకుని బైక్ ల మీద వెళ్తుంటే పెద్దగా ప్రమాదాలు జరగవు.

Add Zee News as a Preferred Source

కానీ చీరలు వేసుకున్నప్పుడు మాత్రం.. కొన్నిసార్లు వారి చీరల కొంగు బైక్ చక్రంలో ఇరుక్కుని పోయి ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. ఇప్పటికే అనేక ఘటనలలో మహిళల చీరల కొంగులు.. బైక్ ల చక్రంలో ఇరుక్కుని మహిళలు నడి రోడ్డు మీద పడిపోయిన ఘటనలు కొకొల్లలు. అయితే.. ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. దీనిలో మహిళతన భర్తలో కలిసి బైక్ మీద వెళ్తుంది.

 

ఇంతలో ఆమె చీర బైక్ టైర్ లోకి వెళ్లి తట్టుకుంటుంది. ఇది గమనించిన వెనక వస్తున్న మరో బైకర్ ఆమెను అలర్ట్ చేశారు కానీ ఆమె మాత్రం తనను సైట్ కొడ్తుండని తెగ ఫీలయ్యింది. నా నంబర్ అడుగుతున్నావా.. నేను ఇవ్వను.. అంటూ ఫోజులు కొట్టింది. అతను మాత్రం.. మీ చీర కొంగు బైక్ చక్రంలో పొతుందని గట్టిగా అరుస్తు చెప్పాడు .కానీ ఆమెకు మాత్రం వినపడలేదు. ఇంతలో  చీర పూర్తిగాబైక్ చక్రంలోకి వెళ్లిపోయి బైక్ నుంచి ఆమె నడి రోడ్డు మీద ధడేల్ అని కింద పడిపోయింది.

అప్పుడు ఆమెకు బైకర్ అరుస్తు చెప్పింది తెలుస్తొంది. ఇదే విషయాన్ని గట్టిగా అరుస్తు చెప్పొద్దఅని రివర్స్ లోమరల అతనిపై అరుస్తుంది. మొత్తంగా అతను మంచి చేయాలని చూసిన .. ఆమెకు కింద పడటం రాసి పెట్టి ఉంది.

Read more: Cobra Snake Video: వామ్మో.. ఏకంగా బెడ్ రూమ్‌లోని  కర్టన్ మీద భారీ నాగు పాము హల్ చల్.. పడగ విప్పి మరీ.. వీడియో ఇదే..   

కాబట్టి ఆమెను కాపాడలేకపోయాడు.. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం.. అందరు చెడ్డవాళ్లు ఉండరు మేడం.. మీరు విన్పించుకుని ఉంటే..ఈ ప్రమాదంలో పడేవారు కాదని సెటైర్ లు వేస్తున్నారు. మరికొంత మంది చీరల్లో బైక్ ల మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా కొంగును సర్దుకొవాలని మరికొంత మంది చెప్తున్నారు. ఈ ఘటన మాత్రం వార్తలలో నిలిచింది.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News