Girl kisses Shark Video: వామ్మో.. డెంజరస్ షార్క్‌కు ముద్దులు పెడుతూ టెంప్ట్ చేసిన యువతి.. షాకింగ్ వీడియో..

Viral Video: యువతి డెంజరస్ షార్క్ కు ముద్దులు పెడుతూ రెచ్చిపోయింది. ఆమె చేస్తున్న పని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 17, 2025, 04:21 PM IST
  • షార్క్ కు యువతి ముద్దులు..
  • వీడియో వైరల్..
Girl kisses Shark Video: వామ్మో.. డెంజరస్ షార్క్‌కు ముద్దులు పెడుతూ టెంప్ట్ చేసిన యువతి.. షాకింగ్ వీడియో..

Woman hugs and kisses with dangerous shark Video: సోషల్ మీడియాలో ఇటీవల ఫెమస్ అయ్యేందుకు యువతీ, యువకులు డెంజరస్ రీల్స్ చేస్తున్నారు. అంతే కాకుండా.. చాలా మంది సోషల్ మీడియాలో ఫాలొవర్స్ లను పెంచుకొవడానికి రకరకాల స్టంట్ లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది తమ ప్రాణాల్ని సైతం రిస్క్ లో పడేసుకుంటున్నారు.

Add Zee News as a Preferred Source

సముద్రాలు, ఎత్తైన ప్రదేశాలు, జలపాతాల దగ్గరకు వెళ్లి మరీ స్టంట్ లు చేస్తున్నారు. కొంత మంది క్రూరమైన జంతువులతో డెంజరస్ స్టంట్ లు చేస్తున్నారు. మరికొన్ని సార్లు.. పాములు, సింహలు, చిరుత పులులు,పాములతో రిస్కీ రీల్స్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో చాలా మంది తమ ప్రాణాలు పొగొట్టుకున్న ఘటనలు కొకొల్లలు.

 

తాజాగా.. ఒక యువతి సముద్రంలో అత్యంత ప్రమాదకరమైన షార్క్ తో రీల్స్ కు దిగింది. సముద్రంలో షార్క్ లు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటిని చూస్తేనే గుండెలు జారిపోతాయి. అలాంటిది ఈ యువతి మాత్రం సముద్రంలో దిగి షార్క్ ముందు దాన్ని పట్టుకుని మరీ ముద్దులు పెట్టుకుంటు, హగ్ చేసుకుంది.

Read more: Cobra Snakes Video: వామ్మో.. రొమాన్స్ చేసుకుంటున్న పాముల్ని డిస్టర్బ్ చేసిన స్నేక్ క్యాచర్.. ఆ తర్వాత..?.. వీడియో మీ కోసం..

మరీ ఆ షార్క్ ఈ అమ్మడి మీద మనసు పారేసుకుందో ఏంటో కానీ.. ఆమె హగ్ చేసుకుంటే ప్రేమతో ఆమెను కౌగిళ్లలో వాలిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. అదీ భయంకరమైన షార్క్..ఒక్కసారి కొరికితే.. బాడీలోని ఒక్కపార్టు కూడా దొరకదని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి డెంజరస్ స్టంట్ లు అవసరమా..అంటూ యువతికి పంచ్ లు వేస్తున్నారు.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News