)
Maid urinate in kitchen utensil in Bijnor uttar Pradesh video: చాలా మంది తమ ఇళ్లలో వంట చేయడానికి, పాత్రలు కడగటానికి పనివాళ్లను పెట్టుకుంటారు. అయితే.. కొంత మంది తమ పనులను తాము నీట్ గా చేసుకుని వెళ్తారు. కానీ ఇంకొందరు మాత్రం నీచమైన అలవాట్లతో ఉంటారు. చోరీలు చేస్తారు. సామానుల్ని ప్రైవేటు పార్ట్ లలో పెట్టుకుని పోతారు.. ఎక్కడ ఏందొరుకుతుందో అని తెగ వెతుకుంటారు. ఓనర్ కళ్లు గప్పి నిరంతం ఏదో ఒకటి చోరీలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు.
ఇంకా కొంత మంది కిచెన్ లో పాత్రలు కడగ మంటే ఉమ్మడం, యజమానుల మీద కోపాన్ని వారి ఇంట్లో చూపిస్తుంటారు. ఇప్పటికే కొంత మంది పనివాళ్లు నీచంగా కిచెన్ లో మూత్రం పోసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ఒక పనిమనిషి రోజు తమ యజమానులకు వండే రోటీల్లో మూత్ర విసర్జన చేసిన నీళ్లను వేసి రోటీలు చేసేది. తీరా వాళ్లంతా ఆస్పత్రి పాలు కావడంతో.. సీసీ టీవీ ఏర్పాటు చేస్తే ఈ ఘోరం తెలిసింది. అచ్చం అలాంటి మరో ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బిజ్నోర్ లో చోటు చేసుకుంది.
Maid gets #caught urinated in a glass and sprayed it on the utensils in the kitchen. pic.twitter.com/z0zxLDj8Tw
— ShoneeKapoor (@ShoneeKapoor) August 22, 2025
ఉత్తర ప్రదేశ్ లోని బిజ్నోర్ లోని నాగినా పట్టణంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పనిమనిషి రోజు కిచెన్ లో పాత్రలను కడగటానికి వెళ్లేది. అయితే.. ఇటీవల కిచెన్ లో మూత్ర విసర్జన చేసిన వాసన వస్తుండటంతో ఇంట్లో వారికి అనుమానం వచ్చింది. పాత్రలు అన్ని కూడా ఎవరో మూత్ర విసర్జన చేసినట్లు కంపు వాసన రావడంతో ఆమెకు తెలియకుండా సీసీ కెమెరా ఏర్పాటు చేశారు.
దీనిలో వాళ్ల ఫ్యూజులు అవుట్ అయ్యే ఘటన వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ పనిమనిషి వంట పాత్రలలో మూత్రం పోసి, గిన్నెలలో దాన్ని వేసి మిగత పాత్రలపై వేయడం సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అది చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అయ్యారు. వెంటనే ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. గత పదేళ్లుగా ఆమె ఆ ఇంట్లో పనిచేస్తుంది.
అయితే.. ఆమె గత రెండు, మూడు నెలల నుంచి వింతగా ప్రవర్తిస్తుండటంతో ఈ క్రమంలో ఆమెపై నిఘాపెట్టారు. తరచుగా ఇంట్లో వారితో వాగ్వాదంకు దిగేది. ఈ క్రమంలో కిచెన్ నుంచి దుర్వాసన వస్తుండటంతో సీసీకెమెరా పెట్టగా ఈ ఘోరం బైటపడింది. వంట మనిషిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
దీంతో ఆ ఇంటి యజమానులు సైతం షాక్ లో ఉండిపోయారు. పదేళ్లుగా ఉన్నపనిమనిషి ఇలా చేస్తుందని అనుకొలేదని పోలీసులకు చెప్పారు. మొత్తంగా ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి