Woman passengers and male passenger fighting in tsrtc bus video: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం పథకంను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. ప్రభుత్వం దీని కోసం ఎంత ఖర్చు భరించడానికి అయిన సిద్దంగా ఉన్నామని ప్రకటించింది. అయితే.. ఉచిత బస్సు ప్రయాణంను కొంత మంది మిస్ యూజ్ చేస్తున్నారని కూడా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొంత మంది మాత్రం తమకు ఉచిత బస్సు అవసరంలేదని రేవంత్ సర్కారుపై మండిపడుతున్నారు.
మరికొందరు మాత్రం ఫ్రీ బస్సు ఉంది కదా అని అవసరం ఉన్నా..లేకున్నా..జర్నీలు చేస్తున్నారు.ఈ క్రమంలో రేవంత్ సర్కారు ఉచితబస్ ప్రయాణం తెచ్చినప్పటి నుంచి కొంత మంది బస్సుల్లో బ్రష్ చేసుకున్న వీడియోలు, కూరగాయలు కట్ చేసిన వీడియోలు, చిన్న పిల్లల్ని ఎక్కించుకుని బాతాఖానీలు కొట్టుకుంటూ కొంత మంది జర్నీలు చేసిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేశాయి. ఇక ఫ్రీ బస్సులో సీట్ల కోసం చాలా చోట్ల మహిళలు సిగపట్లు గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన పనిలేదు. ప్రతిరోజు కూడా ఈ ఘటనలువార్తలలో నిలిచాయి.
ఫ్రీ బస్సులో ఆడోళ్ళు అడోళ్ళు కొట్టుకునేది చూశారు. ఇప్పుడు మొగోళ్ళు ఆడోళ్ళు కొట్టుకునేది చూస్తున్నారు ,
ప్రయాణికులకు తగినన్ని బస్సులు లేవు pic.twitter.com/u4rfg4qXWc— 000009 (@ui000009) April 12, 2025
సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకుని, చీరలు చింపుకున్న ఘటనలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే.. తాజాగా.. మాత్రం మహిళ ప్యాసింజర్, మెల్ ప్యాసింజర్ ను బస్సులొ పొట్టు పొట్టు కొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ ఘటన వేముల వాడ నుంచి సిద్దపేట రూట్లో జరిగినట్లు తెలుస్తొంది. ఇద్దరు మహిళలు బస్సులో ఒక ప్రయాణికుడ్ని చితక బాదారు.
అతను కూడామహిళల జుట్లు పట్టుకుని, కాలితో తన్నుతూ నీచంగా ప్రవర్తించాడు. మరీ వాళ్ల మధ్య సీటు కోసం గొడవనో.. మరేంటో కానీ.. మొత్తానికి వీళ్లు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇప్పటి దాక .. బస్సులో ఆడోళ్లు కొట్టుకొవడం కామన్ గా చూశారు. కానీ ఫస్ట్ టైమ్.. ఆడొళ్లు, మగోళ్లు కొట్టుకొవడం మాత్రం ప్రస్తుతం నెట్టింట విచిత్రంగా ఈ ఘటనను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









