)
Woman rescued big python with bare hands video: సోషల్ మీడియాలో ప్రతిరోజు పాములు, కొండ చిలువల వీడియోలు వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు వీటిని చూసేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో వీటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. చెట్లు, పంట పొలాల దగ్గర పాములు, కొండ చిలువలు ఉంటాయి. పంట పొలాల్లో ఎలుకలు ఉంటాయి. వీటిని తినేందుకు పాములు, కొండ చిలువలు అక్కడ తిష్టవేసుకుని కూర్చుంటాయి. పొలాల్లో పనులకు వెళ్లిన వారిని కాటు వేస్తుంటాయి.
ముఖ్యంగా వానాకాలంలో ఇవి జనావాసాల్లోకి ఎక్కువగా వస్తాయి. చాలా మంది కోబ్రాలు, పైథాన్ లు కన్పిస్తే వెంటనే తమ స్నేక్ క్యాచర్ లకు సమాచారం ఇస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక భారీ కొండ చిలువ పంట పొలాల్లో కన్పించింది. వెంటనే మహిళ స్నేక్ క్యాచర్ కు అక్కడి రైతులు సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే అక్కడకు చేరుకుంది.
కనీసం స్నేక్ లు పట్టుకునే స్టిక్ కూడా లేకుండానే కొండ చిలువను పొదల్లోకి బైటకు లాగింది. దాని తోకను పట్టుకుని పొదల్లోకి పారిపోతున్న కొండ చిలువను పట్టుకుని బంధించింది. అది పలు మార్లు ఆమెపై దాడికి ప్రయత్నించింది. కానీ స్నేక్ క్యాచర్ మాత్రం చాకచక్యంగా కొండ చిలువ దాడి నుంచి తప్పించుకుంది.
మొత్తంగా చివరకు ఎంతో కష్టపడి భారీ కొండ చిలువను బంధించి దట్టమైన అడవిలోకి తీసుకెళ్లి వదిలేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆమె ధైర్యానికి సలాం చెప్పాల్సిందే నంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.