)
woman shouting in temple for big money profits video: ఇటీవల కాలంలో కొంత మంది ఓవర్ నైట్ లో ఫెమస్ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. తమప్రాణాల్ని కూడా పణంగా పెట్టి మరీ రీల్స్ చేస్తున్నారు. జనాలు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడకు వెళ్లి మరీ రీల్స్ చేస్తున్నారు. వీరి రీల్స్ వల్ల చుట్టు పక్కల ఉన్న జనాలు తెగ ఇబ్బందులు పడుతున్నారు.
మొత్తంగా ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో మరీ ఎక్కువయ్యాయి. బస్టాండ్ లు, మెట్రోలు, విమానాల్లో, ఎత్తైన ప్రదేశాలు, సముద్రాలు, క్రూర జంతువుల దగ్గరకు వెళ్లి కూడా కొంత మంది రీల్స్ చేస్తు తమ పైత్యం చూపిస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల వారు డెంజర్ లో పడటమేకాకుండా, కొన్నిసార్లు ఇతరుల్ని కూడా రిస్క్ లో పడేస్తున్నారు. మొత్తంగా కొంతమంది చేస్తున్న పనుల వల్ల ఇతరులు ప్రమాదాల్లో పడుతున్నారు. అయితే..వైరల్ అవుతున్న వీడియోలో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంటాయి.
అచ్చం ఇలాంటి ఒక వీడియో వైరల్గా మారింది. సాధారణంగా దేవుడి గుడికి వెళ్లినప్పుడు ఎవరైన ఏదైన కొరికలు కొరుకుంటారు. అదే విధంగా తమకు కావాల్సిన దాని కోసం దేవుడి ఏదైన సమర్పణ కూడా చేసుకుంటారు. అయితే.. కొంత మంది కోరికలు చాలా విచిత్రంగా ఉంటాయి. దేవుడ్ని కూడా తమకు నచ్చినట్లు ఉపయోగించుకుంటారు.
ఇక్కడొక మహిళ దేవుడి దగ్గరకు వెళ్లింది. పూజలు చేసింది. అయితే.. ఆమె గట్టిగా అరుస్తు.. నీకు 21 రూపాలు సమర్పిస్తున్నాను.. నాకు 21 లక్షలు ఇవ్వాలని కూడా ఆమె గట్టిగా అరుస్తు కేకలు పెట్టింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. ఆమె చేసిన పనికి బిత్తరపోయారు. 21 రూపాలకు, ధనం, ధాన్యం, సంపద మొదలైనవి కల్పి 21 లక్షల వరకు తనకు లాభం వచ్చేలా చూడాలని కూడా ఆమె మొక్కుకుంది.
ఆమె చుట్టుపక్కల ఉన్న వారు ఆమెను విచిత్రంగా చూస్తు ఉండిపోయారు. మరీ ఇది కావాలని రీల్స్ లా తీశారో లేదా అనుకొకుండా జరుగుతుండగా రికార్డు అయ్యిందో కానీ మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.