)
Lovers Holi celebration Funny video: చాలా మంది ఇటీవల ప్రేమ వివాహలు చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అంతే కాకుండా.. లవర్స్ ఎప్పుడు కూడా సీక్రెట్ గా కలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. చాలా మంది ఇంట్లో వాళ్లకు తెలియకుండా తమ లవర్స్ తో సీక్రెట్ గా బైక్ ల మీద వెళ్తు రొమాన్స్ చేసుకుంటారు. అంతేకాకుండా.. కొంత మంది తమ లవర్ లతో ఇటీవల చేస్తున్న పనులతో కాంట్రవర్సీగా మారుతున్నారు .అయితే.. నిజమైన ప్రేమ అనేది ఎవరి నుంచి రిటర్న్ గా ఏదీ కూడా ఎక్స్ పెక్ట్ చేయదని చెబుతుంటారు.
కానీ దీనికి భిన్నంగా కొంత మంతి మాత్రం తమ అవసరాలకు ప్రేమను ఒక పావుగా ఉపయోగించుకుంటున్నారు. అంతే కాకుండా.. తమ అవసరాలు తీరే వరకు మంచిగా ఉన్నట్లు నటిస్తున్నారు. అవసరాలు తీరిపోయాక మాత్రం ముఖం చాటేస్తున్నారు.
Broooo ? pic.twitter.com/QNZd4zNngP
— Random Guy ?? (@_____Random_Guy) March 6, 2025
కొంత మంది ప్రేమ ముసుగులో అడ్డమైన పనులు చేస్తున్నారు. పెళ్లికి ముందే లివింగ్ రిలేషన్ అంటూ రొమాన్స్ లు చేసుకుంటున్నారు. కానీ నిజమైన ప్రేమికులు మాత్రం..తమ వారి కోసం ఎంతటి త్యాగాలు చేయడానికి సైతం వెనుకాడరు. తాము ప్రేమించిన వారి కోసం ఏపనైన చేస్తుంటారు.
ప్రేమలో ఉన్న వారు ఏ పండుగ వచ్చిన కూడా కలిసి సెలబ్రేట్ చేసుకొవాలని తెగ తాపత్రయపడుతుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం హోలీ పండగ వస్తుంది. చాలా చోట్ల ఇప్పటికే హోలీని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఇద్దరు లవర్స్ హోలీని ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ యువతిని ఇంట్లో నుంచి మరీ బైటకు రానీయ్యలేదో మరేంటో కానీ.. ఆమె ఇంటికే ప్రియుడు సీక్రెట్ గా వెళ్లాడు.
అప్పుడు అతను.. తన ప్రియురాలికి గోడ అవతల ఉంటూ.. ఇంట్లో ఉన్న ప్రియురాలికి రంగులను పూసి పండగ చేసుకున్నాడు. ఇద్దరు కూడా హోలీని ఒకరితో మరోకరు ఎంజాయ్ చేశారు. ఇంతలో ఇద్దరు కూడా రొమాంటిక్ మూడో వెళ్లినట్లున్నారు. వాళ్లిద్దరు ఒకరికి మరోకరు ముద్దులు రెడీ అయిపోయారు. అప్పుడే.. అనుకొని ఘటన ఎదురైంది. యువతి ఇంట్లో నుంచి ఆమె ఫ్యామిలీ నుంచి ఎవరో మధ్యలో ఎంట్రీ ఇచ్చింది.
కిస్ కు ప్రయత్నించిన యువకుడి.. గూబ గుయ్యుమనే విధంగా ఒక్కటి కొట్టింది. దీంతో అతగాడికి ఒక్కసారిగా హోలీ నిషా దిగిపోయినట్లైంది. మొత్తంగా యువతి అక్కడి నుంచి అటు, యువకుడు మరోవైపు పారిపోయారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe