Woman smokes cigarette in running flight video: సాధారణంగా ట్రైన్ లలో, విమానాల్లో ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా విమానాల్లో చాలా కఠినంగా రూల్స్ లను పాటిస్తారు. ఎయిర్ వే అధికారులు ఎంతైన బరువు చెబుతారో.. అంతే బరువైన బ్యాగ్ లను ప్రయాణికులు క్యారీ చేయాలి. ఏమాత్రం ఎక్కువున్న సరే.. ఆ బ్యాగ్ ను అక్కడే వదిలేయాలని సూచిస్తారు. ఫ్లైట్ లో ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఎయిర్ వేస్ అధికారులు చర్యలు తీసుకుంటారు.
ఈ క్రమంలో కొందరు విమానంలో ప్రయాణించేటప్పుడు వింతగా ప్రవర్తిస్తుంటారు. తాగి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇతరుల సీట్లలో కూర్చుని రచ్చ చేస్తుంటారు. ఇప్పటి వరకు బస్సులు, రైళ్లలో సీట్ల కోసం కొట్టుకున్న ఘటనలు, ప్రయాణికుల మధ్య గొడవలు చూశాం. ఇక విమానంలో కూడా ఇటీవల అనేక ఘటనలో ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. విమానంలో సైతం కొందరు వెరైటీగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ల ప్రవర్తన వల్ల చాలా మంది ఇబ్బందులకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక మహిళ విమానంలో ప్రయాణిస్తుంది.
Passenger on a flight from Istanbul to Cyprus tried to light the plane on fire
— Tansu Yegen (@TansuYegen) March 22, 2025
విమానంలో డ్రింక్ సదుపాయం ఉంటుంది. మరీ సిగరెట్ ఎందుకు కొట్టకూడదని అనుకుందో ఏంటో కానీ.. ఏకంగా కిటికి దగ్గర కూర్చొని మరీ దమ్ము కొట్టడం స్టార్ట్ చేసింది. దీంతో ఆమెను అక్కడున్న ప్రయాణికులు చూశారు. వెంటనే ఎయిర్ హోస్టెస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో మహిళ మరింత రెచ్చిపోయింది. తనను సిగరెట్ తాగనీయ్యరా.. విమానంను తగలెట్టేస్తానంటూ లైటర్ తీసుకుని సీటు కవర్ కు మంటలు పెట్టేందుకు ప్రయత్నించింది.
Read more: Elephant Video: వావ్ .. చెఫ్‌గా మారి.. గరిట తిప్పుతూ, మసాల దినుసులు దంచుతున్న ఏనుగు.. వైరల్ వీడియో..
అంతేకాకుండా.. అక్కడున్న వారితో గొడవలకు సైతం దిగింది. ఎయిర్ హోస్టెస్ సిబ్బంది ఆమె చేతిలోని లైటర్ ను లాక్కున్నారు. మొత్తంగా ఆమె చేసిన రచ్చతో విమానంలో ఉన్నవారు చాలా టెన్షన్ కు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పొరపాటున అంటుకుంటే.. గాల్లో ఎముకలు కూడా దొరకవని కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









