)
Woman Smoking cigarette in an AC compartment of a running train Video: ఇటీవల కాలంలో చాలా మంది యువతీ, యువకులు రూల్స్ ను పూర్తిగా వయోలెట్ చేస్తున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాలు, ట్రాన్స్ పోర్ట్ ప్రదేశాల్లో కూడా తమకు నచ్చినట్లు ఉంటున్నారు. అసలు ఎవరు ఎలాపోతే తమకు ఏంటన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో రన్నింగ్ ట్రైన్ లలో కొంత మంది యువత చేస్తున్న పాడుపనులు ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి.
రైలులోని ఏసీ కంపార్ట్మెంట్లో సిగరెట్ కాల్చి.. ప్రశ్నించిన వారిని దబాయించిన మహిళ
అభ్యంతరం తెలిపిన తోటి ప్రయాణికులపై రెచ్చిపోయిన మహిళ pic.twitter.com/cn7h2mEwCW
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2025
అంతేకాకుండా కదులుతున్న ట్రైన్ లో రొమాన్స్ చేస్తున్నారు. పబ్లిక్ గా రీల్స్ చేస్తు ఇతరుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.పట్టాల మీద పడుకుని తమ ప్రాణాల్ని డెంజర్ లో పడేయడమే కాకుండా.. ఇతరుల్ని కూడాటెన్షన్ కు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు వైరల్ అవుతున్నాయి.
తాజాగా.. ఒక యువతి ఏకంగా ఏసీ కంపార్ట్ మెంట్ లో సిగరెట్ తాగుతూ అందరికి చుక్కలు చూపించింది. ఆమెను ప్రశ్నించగా రివల్స్ లో వారిపైన మాటల దాడికి దిగింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. యువతి రన్నింగ్ ట్రైన్ లో కూర్చుని అదేదో పాప్ కార్న్ తిన్నట్లు గుప్పు.. గుప్పు దమ్ముకొడుతుంది.
అయితే.. ట్రైన్ ఆగి ఉంది. ఇంతలో ఆమె చేస్తున్న పనిని ఒక వ్యక్తి సీరియస్ అయ్యి వీడియో తీశాడు. బైటకు పోయి సిగరెట్ తాగాలని చెప్పాడు. కానీ ఆమె మాత్రం రివర్స్ లో ట్రైన్ ఏమన్నా నీదనుకుంటున్నావా..అంటూ గొడవకు దిగింది. అక్కడున్న వారంతా ఆమెకు చెబితే అప్పుడు కానీ వెనక్కు తగ్గలేదు.
పోలీసుల్ని పిలిస్తే పిల్పించుకొండి అంటూ చాలా రూడ్ గా మాట్లాడింది. మొత్తంగా ఆమె అతిని సదరు వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. పొరపాటున మంటలు అంటుకుంటే.. అందరు పోతారని కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook