Women In Without Clothes Viral News: భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం.. భారతదేశంలో వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ భాషలు, వివిధ వర్గాలు, వివిధ సాంప్రదాయాలతో జీవించేవారుంటారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో జీవనం కొనసాగించేవారు వారి సాంప్రదాయాలకు అనుగుణంగా వివాహా, ఆరాధన పద్ధతులు, దేవతలు, ఆహార పద్ధతులు మారుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో పూర్వికులు పాటించే సాంప్రదాయాలు కూడా ఇప్పటికీ అలానే కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రాంతం ఆధారంగా అన్నీ మారుతి వస్తూ ఉంటాయి. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పురాతన సాంప్రదాయ పద్ధతులు పాటించేవారు కూడా ఉన్నారు. వీరికి సంబంధించిన ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఇటీవలే ఇలాంటి వింత సాంప్రదాయానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
భారతదేశంలో వివాహాల్లో చాలా సంప్రదాయాలు ఉంటాయి. ఇందులో కొన్ని వింత సాంప్రదాయాలు కలిగి ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ లోని ఓ గ్రామంలో అలాంటి ఓ వింత సాంప్రదాయమే ఇప్పుడు సోషల్ మీడియాను చుట్టేస్తోంది.. ఆ ప్రాంతంలో పెళ్లి తర్వాత వధువులంతా కొన్ని వారాలపాటు బట్టలు వేసుకోకుండా ఉంటారట.. ఈ సాంప్రదాయం ఇప్పటికీ మణికరణ్ లోయలోని పిని గ్రామంలో కొనసాగుతూ వస్తోంది. అయితే పెళ్లయిన నవ వధువు ఎలాంటి బట్టలు లేకుండా ఉన్నప్పుడు వరుడితో సంభాషణ ఉండకూడదు అని ఒక రూల్ కూడా ఉందట. గ్రామంలోని ఈ ఆచారం శ్రావణమాసం నెలలోని వివాహం జరిగిన తర్వాత మాత్రమే ఇలా బట్టలు ధరించకూడదని ఒక రూల్ ఉందట.
అయితే ఈ సాంప్రదాయంలో భాగంగా నవవధువు పూర్తిగా బట్టలేకుండా ఉండకుండా కేవలం పుట్ట అనే ఉన్ని దస్త్రాన్ని ధరించవచ్చని అక్కడి ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఈ సమయంలో వరుడు కూడా తప్పకుండా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. వధువు బట్టలేకుండా ఉన్నప్పుడు వరుడు ఎలాంటి మద్యం ముట్టుకోకూడదని అలాగే మాంసాహారం కూడా తినవద్దని అక్కడి వారు చెబుతున్నారు ఒకవేళ ఇవి రెండు పాటించకపోతే జీవితంలో అనేక దుష్ప్రభావాలు ఎదురవుతాయని ఒక నమ్మకం. అయితే ఈ సమయంలో నిష్టగా ఉన్నవారికి జీవితాంతం సుఖసంతోషాలు కలుగుతాయని అక్కడి ప్రజల నమ్మకమని స్థానికులు చెబుతున్నారు.
మణిపూర్ లోని ఓ గ్రామంలో దీనికి విభిన్నంగా ఓ ప్రత్యేకమైన ఆచారం ఉంది. వధూవరులకు సంబంధించిన కుటుంబీకులు ఇద్దరు మహిళలు పెళ్లిలో భాగంగా ఓ నీటి సంపులో రెండు చేపలను వదులుతారు. ఈ రెండు చేపలు కలిసి ఎంతో ఆనందంగా ఈత కొడితే తమ జీవితం కూడా వైవాహికంగా చాలా బాగుంటుందట అంతే కాకుండా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని అక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు అలాగే ఈ రెండు చేపలు ఒకదానికొకటి దాడి చేసుకుంటే జీవితం మొత్తం వధూవరులు ఇలానే దాడి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇవే కాకుండా భారత దేశంలో అనేక రకాల వింత సాంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి..
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









