Young Woman Without Clothes Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు నెటిజన్స్ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తున్నాయి. ఇందులో మరికొన్ని వీడియోలు సోషల్ వినియోగదారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇలా నిత్యం లక్షలాది వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే ఇటీవల విమానంలో ఓ ప్రయాణికురాలు చేసిన అల్లరి కి సంబంధించిన వీడియో ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకీ ఆ వీడియో ఏంటో? ఆ ప్రయాణికురాలు ఉన్నట్లుండి విమానంలో అలా చేయడానికి గల కారణాలేంటో? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వీడియో వివరాల్లోకి వెళితే.. విమానంలో ఉన్నట్టుండి ఓ యువతికి సంబంధించిన కేకలు వినిపిస్తూ ఉంటాయి. ఇంతలోనే ముందుకు తిరిగి చూస్తే ఆ యువతి బట్టలేకుండా కేకలు వేస్తూ అరుస్తూ అటు ఇటు తిరగడం గమనించవచ్చు. వీడియోలో ఆ యువతి ఎలాంటి బట్టలు లేకుండా ఉండడం చూసి ప్రయాణికులు కూడా ఒక్కసారిగా కేకలు వేశారు. ఈ సన్నివేశాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఘటన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం 733లో చోటుచేసుకుంది. హూస్టన్ నుండి ఫీనిక్స్ వెళ్తున్న విమానంలో ఇలా ఆ యువతి ఒక్కసారిగా బట్టలు లేకుండా అటు ఇటు నడవడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది.
ఈ విమానం విలియం పి. హాబీ విమానాశ్రయం నుంచి రన్వే పై పైకి ఎగురుతుండగానే ఆ మహిళ ఒక్కసారిగా తనకున్న దుస్తులను పూర్తిగా వండి పైనుంచి తీసేసి నగ్నంగా విమానం క్యాబిన్లో అటు ఇటు తిరగడం ప్రారంభించింది. అక్కడున్న ప్రయాణికులు కూడా ఆమెను ఏమాత్రం ఆపకుండా అలాగే చూస్తుండి పోయారు. ఇలా ఆ మహిళ 25 నిమిషాల పాటు అలాగే దుస్తులు లేకుండా అటు ఇటు తిరిగిందని కొంతమంది ప్రయాణికులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆమె వెంటనే విమానం తలుపులు తెరిచి బయటికి పంపాలని కూడా డిమాండ్ చేసిందట..
దీంతో ఆ విమాన సిబ్బంది ఆమె చేస్తున్న డిమాండ్ పై స్పందించి విమానాన్ని టేక్ ఆఫ్ చేసి ఆమెను అక్కడి నుంచి బయటికి పంపించారు. అంతేకాకుండా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపడుతున్నారు. అయితే ఆమె పోలీసుల నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో కొంతమంది ప్రయాణికులు ఆమెను పట్టుకొని మళ్లీ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రయాణికులకు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని విమాన సిబ్బంది క్షమించాలని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









