World Biggest Venomous Black King Cobra Video: అత్యంత ప్రమాదకరమైన పాముల్లో బ్లాక్ కింగ్ కోబ్రా (Black King Cobra) ఒకటి. దీని శాస్త్రీయంగా హేమచాటస్ అట్రా (Hemachatus atra) అని పిలుస్తారు. అయితే సాధారణంగా ఇది నిజమైన కింగ్ కోబ్రా జాతికి సంబంధించినది కాదని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు..ఈ పాములు ఎలాపిడే (Elapidae) జాతికి చెందినవే.. అయితే ఈ బ్లాక్ కింగ్ కోబ్రాలు ఎక్కువగా దక్షిణాఫ్రికాలోని కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీటిని ప్రమాదకరమైన పాములుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. సాధారణంగా 6 అడుగుల నుంచి 7 అడుగులు ఉంటాయి. ఇవి 3 మీటర్ల కంటే ఎక్కువగా పొడవు పెరుగుతూ ఉంటాయి.
సాధారణంగా కింగ్ కోబ్రాలు చాలా ప్రమాదకరమైనవి.. ఇవి జంతువులపై దాడి చేసే క్రమంలో తప్పకుండా దానికున్న మెడ భాగంలో పక్కటెముకలను వెడల్పుగా చేసి హెచ్చరిస్తూ ఉంటాయి. ఇదే జాతికి సంబంధించిన కొన్ని పాములు తెలుపు రంగుతోఓ పాటు పసుపు, ఆకు పచ్చ రంగుల్లో కూడా ఉంటాయి. అంతేకాకుండా వీటి కళ్లు చిన్నగా.. చాలా స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్లాక్ కింగ్ కోబ్రాలు ఎక్కువగా దక్షిణాఫ్రికాలోని వివిధ ఆవాసాలలో నివసిస్తాయి. ఇవి వాటి గూడును గడ్డి భూములు, పొదలు, అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటాయి.
ఈ పాములు ఎక్కువగా పగటిపూట చాలా చురుకుగా ఉంటాయి. అంతేకాకుండా నేలపై నివసించే చిన్న చిన్న పాములతో పాటు క్రిమి కీటకాలను తింటూ ఉంటాయి. అయితే ఈ పాములన్నీ విషరహిత పాములను మాత్రమే తింటూ ఉంటాయి. అందుకే వీటిని ప్రమాదకరమైన పాములుగా చెప్పుకుంటారు. అయితే వీటి విషయం కూడా చాలా విషపూరితమైనది. అయితే ఇది కాటేస్తే, నాడీ వ్యవస్థపై ప్రభావం పడి మరణానికి దారి తీసే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఇలాంటి పాములు చాలా అరుదుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇటీవలే కూడా ఓ వీడియో వైరల్ అవుతోంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
బ్లాక్ కింగ్ కోబ్రాలు చాలా అరుదుగా బయట కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇటీవలే వైరల్ అవుతున్న వీడియోలో కూడా రెండు బ్లాక్ కింగ్ కోబ్రాలు చూడడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఇందులో ఒక పాము ఇంకో పాముపై దాడి చేయడం మీరు గమనించవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను @tamim.404 అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు 16 వేల మంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









