30 Foot Long Giant Anaconda Video Watch: నిత్యం పాములకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో అన్ని సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అందుకే చాలామంది నేటిజన్స్ ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. అంతేకాకుండా ఎవరైనా సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు షేర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే విపరీతంగా వైరల్ అవుతూ వస్తాయి. ముఖ్యంగా పెద్దపెద్ద అనకొండ పాములకు సంబంధించిన వీడియోలైతే తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. తాజాగా కూడా ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన పాముకు సంబంధించిన వీడియో కనిపించింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతూ వస్తోంది.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
సాధారణంగా అనకొండలు 10 అడుగుల నుంచి 55 అడుగుల వరకు పెరుగుతాయి. ఇవి అత్యంత శక్తివంతమైన కండరాలు కలిగి ఉంటాయి. విషపూరితమైనవి కాకపోయినా తన శత్రువును చుట్టూ చుట్టూ కండరాలతోనే చంపేస్తాయి. అందుకే చాలామంది వీటి దగ్గరికి వెళ్లేందుకు కూడా ఇష్టపడరు. అయితే ఇలాంటి అత్యంత పెద్ద అనకొండ పాము కు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంస్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
సాధారణంగా అందరూ 10 నుంచి 15 అడుగుల అనకొండ పాములను చూసి ఉంటారు.. కానీ ఈ వీడియోను ఏకంగా 30 అడుగుల పెద్ద అనకొండ పాము నదిలో ఈదుకుంటూ వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వీడియో వివరాల్లోకి వెళితే.. అమెజాన్ నదిపై ప్రయాణం చేస్తున్న ఓ హెలికాప్టర్ పైలెట్‌కి నదిలో అత్యంత పొడవైన అనకొండ పాము కనిపిస్తుంది. అది నదిలో ముందుకు కదలడం గమనించిన ఆ పైలెట్ కెమెరాతో వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది..
సాధారణంగా 30 అడుగుల అనకొండ పాములు కనిపించడం చాలా అరుదు. ఇవి కేవలం ఎక్కువగా అమెజాన్ అడవుల్లో జీవిస్తూ ఉంటాయి. అమెజాన్ అడవి పైనుంచి ప్రయాణం చేసే ప్రయాణికులకు ఎక్కువగా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. ఇలా దాని గుండా ప్రయాణించిన కొంతమంది అప్పుడప్పుడు ఇలా కనిపించిన పాములను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇలా పోస్ట్ చేసిన వీడియోనే వైరల్ గా మారింది. ఈ వీడియోను స్పేస్ ఎక్స్ప్లోరర్ AI అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. అయితే, ఈ వీడియోని చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఇది నిజమైన వీడియో కాదని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ ద్వారా సృష్టించిన వీడియోని కామెంట్లు చేస్తున్నారు.
Also Read : India: బ్రిటిష్ వారు భారత్ నుంచి దోచుకెళ్లిన సంపాదన ఎంతో తెలుసా?.. తెలిస్తే, ఆశ్చర్యపోతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









