)
Largest Python Video: మీరు ఎప్పుడైనా ప్రపంచంలోనే అత్యంత పొడవైన కొండచిలువ పాములను చూశారా? ఇప్పటికీ ఎప్పుడు చూసి ఉండరు.. కానీ మీరు ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోలు ఓ అత్యంత ప్రమాదకరమైన కొండచిలువ పాము.. కొండను ఎక్కుతూ కనిపిస్తోంది. ఇది చూడడానికి అత్యంత పొడవుగాను అలాగే భారీ శరీరాన్ని కలిగి ఉంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. కొండచిలువలు ఎంత పెద్దగా ఉంటాయా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ కొండచిలువ పాముకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను 'బెన్ సోజో' అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియోను "Giant Python Caught On Camera" అని క్యాప్షన్ రాసి పోస్ట్ చేశారు. పది సెకన్ల నిడివి గల వీడియోను చూసి చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోలో భారీ కొండచిలువ.. కదులుతూ కొండపైకి వెళ్లడం మీరు చూడొచ్చు. ఈ వీడియోలో ఆ భారీ ఆకారం కలిగిన పాము నెమ్మది నెమ్మదిగా కదులుతూ.. ఉండడం మీరు చూడొచ్చు. ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా కనిపిస్తాయని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియోలో కనిపిస్తున్న అత్యంత పెద్ద అనకొండ ప్రపంచంలోనే ఉన్న పెద్ద అనకొండలో ఒకటి. అయితే ఇలాంటివి కేవలం అమెజాన్ నది పరివాహక ప్రాంతాల్లో మాత్రమే జీవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అమెజాన్ అడవికి దగ్గరగా జీవించే చాలామందికి ఈ పాములు తప్పకుండా కనిపిస్తూ ఉంటాయి. అయితే, ఇప్పటివరకు ఈ వైరల్ అవుతున్న వీడియోను రెండు లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 3,000 మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook