)
World Longest Venomous Cobra Video Viral: ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని సెకన్ల నిడివిగల వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. వీటిని చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలైతే ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి. పెద్ద పెద్ద పాములను రెస్క్యూ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు కోట్ల వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. ముఖ్యంగా కొన్ని అరుదైన వీడియోలైతే ఎంతగానో వైరల్ అవుతున్నాయి. తాజాగా కూడా వైరల్ అవుతున్న ఓ అరుదైన వీడియో ఇప్పుడు అందరినీ ఆచార్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో Rv Sinha అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేసిన 10 సెకండ్ల నిడివి గల వీడియోను చాలామంది చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన పెద్ద నాగు పాము ఓ గట్టుపై ఉండి.. పడగ విప్పి నిలబడడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోలో నాగుపాము దాని పడగను అటు ఇటు కదపడం కూడా మీరు గమనించవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు చూసి షేర్ చేస్తున్నారు.
ముఖ్యంగా వేసవితో పాటు వర్షాకాల సమయంలో తరచుగా ఇలా అత్యంత ప్రమాదకరమైన పెద్ద నాగుపాములు బయటికి రావడం సర్వసాధారణం. ఇందులో భాగంగానే ఈ పాము బయటికి వచ్చి.. ఎటు వెళ్లాలో తెలియక గట్టుపై పడగవిప్పి నిలబడిందని అక్కడే ఉన్న స్థానికులు చెబుతున్నారు. అలాగే ఈ పామును చూస్తుంటే ప్రపంచంలోనే.. ఇదే పెద్ద పాముగా ఉన్నట్లు అనిపించక తప్పదు.. ఈ వైరల్ అవుతున్న వీడియోను స్థానికులే తమ స్మార్ట్ ఫోన్లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.
అయితే ఈ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతున్నప్పటికీ.. ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ వీడియోని చూసిన చాలామంది వన్యప్రాణి సంరక్షకులు.. అడవి ప్రాంతాల్లో ఉండేవారు చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి ప్రమాదకరమైన పాములు కనిపించినప్పుడు తప్పకుండా అడవి శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని చెబుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి పాములు కనిపించినప్పుడు వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook