Venomous Viper Warning Viral Video: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముల్లో గబూన్ వైపర్ (Gaboon Viper) పాము ఒకటి. ఈ పాములు ఎక్కువగా ఆఫ్రికా ఖండంలోని వర్షారణ్యాలతో పాటు అటవీ ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటాయి. దీంతో పాట ఈ పాము శాస్త్రీయ నామమైన Bitis gabonica పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ పాము అన్ని పాముల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా స్పెషల్ కలర్‌లో ఎంతో ఆకర్శనీయంగా కనిపిస్తుంది. అలాగే దీని శరీరం ఆకారం, తల భాగం కూడా చాలా స్పెషల్‌గా ఉంటుంది.
గబూన్ వైపర్ చాలా పెద్ద శరీరంతో పాటు బలమైన కండరాలను కలిగి ఉంటుంది. ఇది సగటున 1.2 నుంచి 1.5 మీటర్ల పొడవు వరకు పెరుగుతుందని సమాచారం. అంతేకాకుండా కొన్నిసార్లు 2 మీటర్ల వరకు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అన్ని పాముల శరీరాల్లా కాకుండా దీని శరీరం చాలా లావుగా ఉంటుంది. అందకే చూడగానే బరువుగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీని తల పెద్దగా, త్రిభుజాకారంగా ఉంటుంది. అలాగే మెడ భాగం స్పష్టంగా వేరు చేసినట్లు కూడా కనిపిస్తుంది.
ఇక ఈ పాములకు సంబంధించిన రంగుల వివరాల్లోకి వెళితే.. ఈ జాతిలో పెరిగే ఒక్కొక్క పాము, ఒక్కొక్క రంగులో కనిపిస్తూ ఉంటుంది. కొన్ని పాములు గోధుమ, ఊదా, గులాబీతో పాటు పసుపు రంగుల కలయికతో కూడా ఉంటాయి. కొన్ని పాములైతే.. సాధారణ బ్లాక్ కింగ్ కోబ్రాల్లా కనిపిస్తాయి. ఈ పాములు ఉండే కలర్ ఆకులు రాలిన నేలలో కలిసిపోవడానికి సహాయపడుతుంది. కాబట్టి సులభంగా ఎలాంటి ఆహారాలనైనా పట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో మనం ఇలాంటి పాములు చాలా అరుదుగా చూస్తూ ఉంటాం..తాజాగా ఈ గబూన్ వైపర్ (Gaboon Viper) పాముకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో గబూన్ వైపర్ (Gaboon Viper) కోరలను బయటి పెట్టి కెమెరా వైపు చూస్తుండడం ఇందులో చూడొచ్చు. అంతేకాకుండా ఈ వీడియోలో పాముకు సంబంధించిన కేవలం తల భాగమే కనిపించడం మీరు గమనించవచ్చు. అయితే ఇప్పటి వరకు ఈ షార్ట్ వీడియోను 80 లక్షల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని @RobertWedderburn అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 2 వేల మంది కామెంట్స్ చేశారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









