)
Rare White Cobra Video Viral News: మనం ఇప్పటివరకు ఎన్నో రకాల పాములను చూసి ఉన్నాం.. ఈ పాములు మనకు ఎక్కువగా నలుపు రంగుతో పాటు గోధుమ రంగులో అప్పుడప్పుడు ఏర్పు రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని పాములు అయితే సన్నగా పసుపుపచ్చ రంగులో కూడా కనిపిస్తాయి. అప్పుడప్పుడు గ్రీన్ కలర్లో పాములు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ రంగుల్లో పాములు అందరు ఎప్పుడో ఒకసారి చూసి ఉంటారు.. కానీ ఎప్పుడైనా తెలుపు రంగులో ఉండే పాములను చూశారా? అందులో అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా జాతికి సంబంధించిన పాములు చూశారా? చూడని వారు తప్పకుండా ఈ వీడియో చూడండి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో అత్యంత ప్రమాదకరమైన తెలుపు రంగులో ఉన్న కింగు కోబ్రా చూడొచ్చు.
సాధారణంగా తెలుపు రంగులో ఉన్న కింగ్ కోబ్రాలు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి. ఇవి చూడడానికి చాలా ప్రత్యేకంగా ఉంటాయి అంతేకాకుండా తీవ్ర విషయాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటి పాములు చాలా తక్కువ మందికి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది ఈ తెల్ల కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నిజంగా ఈ వీడియోను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు. కింగ్ కోబ్రా పాముల్లో కూడా ఇలాంటి తెలుపు రంగు సంబంధించిన పాములు కూడా ఉంటాయని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ తెలుపు రంగు కింగ్ కోబ్రా పడక విప్పి నేలపై అటు ఇటు కదలడం మీరు చూడొచ్చు. అయితే దీనికి వెనకాలోని ఓ స్నేక్ క్యాచర్ స్నేక్ స్టిక్ ను పట్టుకొని రెడీగా ఉన్నాడు. పాము అటూ ఇటూ కదులుతున్న సందర్భంలోనే.. ఈ వీడియోని చిత్రీకరించి ఉండటం మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఈ కొన్ని సెకండ్ల నిడివిగల వీడియోనే వైరల్‌గా మారింది. అయితే ఈ పాము వీడియోని ఎక్కడ చిత్రీకరించారని అంశాన్ని వివరించక పోయిన.. పాము కు సంబంధించిన వీడియో మాత్రం వైరల్ గా మారింది.
ఈ వైరల్ అవుతున్న వీడియోను యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసి మూడు సంవత్సరాల అవుతున్నప్పటికీ.. ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. దీనిని ఇప్పటివరకు ఒక కోటి మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా కొన్ని లక్షల మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను లైక్ చేసినట్లు తెలుస్తోంది. చాలామంది దీనిని చూసి కామెంట్లు కూడా పెట్టారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook