Xiaomi Redmi Note 11 Pro specs: షావోమి నుంచి రెడ్‌మి నోట్ 11 ప్రో మొబైల్ వచ్చేస్తోంది

Xiaomi Redmi Note 11 Pro specs : జేడీ.కామ్‌లో అడ్వాన్స్ రిజర్వేషన్స్ కోసం పేర్కొన్న వివరాల ప్రకారం ఈ సిరీస్‌లో నోట్ 11 5G, నోట్ 11 ప్రో 5G, నోట్ 11 ప్రో+ 5G (Note 11 5G, Note 11 Pro 5G, and Note 11 Pro+ 5G) మొబైల్స్ మార్కెట్‌లోకి రానున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2021, 01:21 PM IST
Xiaomi Redmi Note 11 Pro specs: షావోమి నుంచి రెడ్‌మి నోట్ 11 ప్రో మొబైల్ వచ్చేస్తోంది

Xiaomi Redmi Note 11 Pro specs: స్మార్ట్ ఫోన్ లవర్స్‌కి గుడ్ న్యూస్. ముఖ్యంగా రెడ్‌మి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్స్‌ని ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ గుడ్ న్యూస్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. షావోమికి చెందిన సబ్‌బ్రాండ్ అయిన రెడ్‌మి నుంచి రెడ్‌మి నోట్ 11 ప్రో పేరిట మరో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది. తాజాగా షావోమి ఈ స్మార్ట్ పోన్ లాంచింగ్ డీటేల్స్ వెల్లడించింది. అక్టోబర్ 28న చైనాలో జరిగే లైవ్ ఈవెంట్‌లో రెడ్‌మి నోట్ 11 ప్రో సిరీస్ మొబైల్స్‌ని లాంచ్ చేయనున్నట్టు షావోమి ప్రకటించింది. 

Xiaomi Redmi Note 11 Pro specs revealed - రెడ్‌మి నోట్ 11 ప్రో సిరీస్ ప్రత్యేకతలు :
రెడ్‌మి నోట్ 11 ప్రో మొబైల్ లాంచింగ్ పోస్టర్‌ని గమనిస్తే... ముందు భాగంలో పైన పంచ్ హోల్ కెమెరాను అమర్చారని అర్థమవుతోంది. అలాగే వెనక భాగంలో త్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు ఫ్లాష్‌లైట్ ఏర్పాటు చేసి ఉన్నాయి. 3.5 ఎంఎం ఆడియో జాక్, ఐఆర్ బ్లాస్టర్ మైక్రోఫోన్, జేబీఎల్ ట్యూన్డ్ స్పీకర్ ఉన్నాయి. మొబైల్‌కి కుడి భాగంలో పక్కన పవర్ బటన్, వాల్యూమ్ అడ్జస్ట్‌మెంట్స్ బటన్స్ ఉన్నాయి. 

చైనాలో సేల్స్ అడ్వాన్స్ బుకింగ్స్ కోసం జేడీ.కామ్‌లో రెడ్‌మి నోట్ 11 ప్రో సిరీస్ ఫోన్స్ లిస్ట్ చేసింది. జేడీ.కామ్‌లో అడ్వాన్స్ రిజర్వేషన్స్ కోసం పేర్కొన్న వివరాల ప్రకారం ఈ సిరీస్‌లో నోట్ 11 5G, నోట్ 11 ప్రో 5G, నోట్ 11 ప్రో+ 5G (Note 11 5G, Note 11 Pro 5G, and Note 11 Pro+ 5G) మొబైల్స్ మార్కెట్‌లోకి రానున్నాయి. నవంబర్ 1 నుంచి చైనాలో ఈ ఫోన్స్ విక్రయాలు ప్రారంభం కానున్నట్టు షావోమి పేర్కొంది. 

Also read : Wireless Earbuds Offers: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఇయర్ బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు ఇవే

6 GB RAM + 128 GB స్టోరేజ్, 8 GB RAM + 128 GB స్టోరేజ్, 8 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్స్‌లో ఈ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. 

Xiaomi Redmi Note 11 Pro specs leaked online: ఇటీవల ఈ స్మార్ట్ ఫోన్ గురించి లీక్ అయిన ఇంకొన్ని ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
డిస్‌ప్లే, రిఫ్రెష్ రేటు: 120Hz రిఫ్రెష్ రేటు కలిగిన LCD screen
13MP ఫ్రంట్ కెమెరా
50MP రీయర్ కెమెరా
డైమెన్సిటీ 810 ప్రాసెసర్
33 వాట్స్ ఫాస్ట్ చార్జర్ కలిగిన 5000 mAh బ్యాటరీ

Also read : Realme GT Neo 2 5G mobile price, specs: రియల్‌మి జిటి నియో 2 5G మొబైల్ ధర, స్పెసిఫికేషన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News