COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Viral Video News Today: రోజు ఉదయాన్నే ఆఫీస్‌లోకి వెళ్లడం ఉద్యోగంలో భాగం..అయితే కొందరి ఆఫీసులు బాగుంటే, మరికొందరివి మాత్రం ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా ఉంటాయి. దీని కారణంగా బొద్దింకలు, దోమలు, ఎలకలు వస్తూ ఉంటాయి. వీటి కారణంగా ఆఫీసుల్లో ఉండే ఉద్యోగాలు పడరాని పాట్లు పడతారు. అయితే ఇలాంటి సంఘటనే ఓ కంపెనీలో జరిగింది.  ఆఫీస్‌లో బొద్దింకలకు భయపడి ఓ యువతి లక్షల విలువైన ఉద్యోగాన్ని వదిలేసింది. ఈ ఘటన  దక్షిణ చైనాలోని గ్వాంగ్‌జౌలో జరిగింది. ప్రస్తుతం ఆ యువతి సోషల్‌ వీడియాలో షేర్‌ చేసిన పోస్ట్‌ తెగ వైరల్‌గా మారింది.


ఆ యువతి తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర చైనాలోని మంగోలియా ప్రాంతానికి చెందిన షియోమిన్ అనే యువతి గత మూడేళ్లుగా గ్వాంగ్‌జౌ నగరంలో  వీడియో ఎడిటర్  పని చేస్తోంది. అయితే తను ఇప్పటికి వరకు బొద్దింకను చూడలేదట..అయితే ఒక రోజు తన ఆఫీసులో ఉన్నప్పుడు కింద పాకుతూ వెళ్లినప్పుడు చూసిందని తెలిపింది. ఆ రోజు నుంచి తనకు బొద్దింక చూసినప్పుడుల్లా భయంతో పరుగులు పెట్టేదట. చివరకు ఆ యువతికి చిరకు వేసి లక్షల విలువ గల వీడియో ఎడిటర్‌ జాబ్‌ని వదిలేసిందని వెల్లడించింది. 


Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు


అంతేకాకుండా ఆఫీస్‌లో బొద్దింకలు తన వద్దకు రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలే చేసిందంట యువతి. కొన్ని సందర్బాల్లో బొద్దింకలు రాకుండా ఉండడానికి వివిధ పురుగుల మందులను కూడా వినియోగించేదని సమాచారం. అంతేకాకుండా ఆఫీసులో మెయింటెనెన్స్ గురించి కూడా ఆ అమ్మాయి సోషల్‌ మీడియాలో క్లుప్తంగా వివరించింది. ఆ యువతి ఇలా తెలిపింది..గదిని శుభ్రం చేయడానికి ఎవరు రారని,  సీలింగ్, కిటికీల నుంచి తరచుగా బొద్దింకలు, ఈగలు, దోమలు వస్తుండేవని అమె తెలిపింది.  


బొద్దింకలు చూసి మహిళలు తరచుగా భయపడుతూ ఉంటారు. కొంతమంది మహిళలైతే అది దగ్గరికి వచ్చిందంటే చాలు దూరంగా బయపడి వెళ్లిపోతు ఉంటారు. ఇక చిన్న పిల్లల వియానికొస్తే..వాటిని ముట్టుకుని వాటితో ఆడుకుంటూ ఉంటారు. ప్రస్తుతం బొద్దింకలతో చాలా మంది ఫ్రాంక్‌ వీడియో కూడా చేస్తున్నారు. ఇవి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్నాయి. 


Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook